ఆ హీరో అయితేనే నయనతార రెడీనట!
హీరోయిన్ల స్టేట్ మెంట్లు విచిత్రంగా ఉంటాయి. ఒక హీరోయిన్ కు నచ్చిన పని మరొక హీరోయిన్ కు చులకనగా ఉంటుంది. అదే హీరోయిన్ చేసే పని మరో హీరోయిన్ కు హీనంగా అనిపించవచ్చు. ఇక విషయంలోకి వెళితే ఐటమ్ సాంగ్ చేస్తే గీస్తే రజనీకాంత్ తో మాత్రమే చేస్తానంటోంది నయనతార. ఎందుకలా అంటే డబ్బుకోసం ఐటమ్ సాంగ్ లు చేసే స్థితికి దిగజారలేదని అంటోంది. వడివేలుతో ఐటమ్ సాంగ్ చేసిన శ్రియాను దృష్టిలో పెట్టుకుని నయనతార ఈ స్టేట్ మెంట్ ఇచ్చిఉండవచ్చు. ఇది బానే ఉందికానీ ఇటీవల విడుదలైన బిల్లా సినిమాలో బికినీలో ఎందుకు కనిపించిందోనని ఆమె వ్యతిరేకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏవరేమేసుకున్నా బిల్లా సినిమాలో బికినీలో నయనతార చాలా అందంగా కనిపించిందని సినీ విశ్లేషకులు రంగరించారు. తెలుగులో బాలకృష్ణ హీరోయిన్ గా కనిపించనున్న నయనతారకు చెప్పుకోదగ్గ హిట్లు లేక స్టేట్ మెంట్ల మీద స్టేట్ మెంట్లు ఇస్తోందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











