»   » నయనతారకు దర్శకుడి పిలుపు, ఒప్పుకుంటుందా?

నయనతారకు దర్శకుడి పిలుపు, ఒప్పుకుంటుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ నయనతార రియల్ లైఫ్‌ ఎన్ని ఆటు పోట్లకు గురైందో పాఠకులకు మళ్లీ కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రియల్ లైఫ్ లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను మరిచి పోయేందుకు తన ఫోకస్ అంతా మళ్లీ రీల్ లైఫ్‌పై పెట్టింది ఈ మళయాల ముద్దుగుమ్మ.

గతంలో నయనతార రజనీకాంత్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించి మెప్పించింది. ప్రభుదేవాతో ప్రేమాయణంతో సినిమాలకు దూరమైన నయన తర్వాత అతనితో విడిపోయిన అనంతరం మళ్లీ సినిమాల్లో..... సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో నయనతార సీనియర్ హీరోలతో కాకుండా యువ హీరోలతో నటించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. రాణా, ఆర్య, గోపీచంద్, ఉదయనిధి స్టాలిన్ లాంటి వారితోనే ఇప్పటి వరకు సినిమాలు చేసింది. ఒక వేళ సీనియర్ హీరోలతో చేయాల్సి వచ్చినా అజిత్, నాగార్జున లాంటి ఫాంలో ఉన్న వారితో అయితే ఫర్వాలేదనే భావనతో ఉంది.

యువ హీరోలతో చేస్తేనే హీరోయిన్‌గా తన కెరీర్ ఎక్కువ కాలం కొనసాగుతుందనే ఆలోచనలో ఉంది నయనతార. అయితే తాజాగా నయనతారకు మరో సీనియర్ హీరోతో అవకాశం వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్-వెంకటేష్‌లతో తెరకెక్కే మల్టీస్టారర్ మూవీలో వెంకటేష్‌కి జోడీగా చేయాలని కృష్ణ వంశీ అడిగారట. ఈ చిత్రంలో చెర్రీకి జోడీగా కాజల్‌‌‌ను ఎంపిక చేసారు. వెంకీ సరసన కావడంతో ఈ సినిమాకు ఒప్పుకోవాలా? వద్దా? అనే మీమాంసలో పడిందట నయనతార.

English summary
Nayantara has roped to play a heroine in Krishna Vamsi direction.This multi starrer movie starring Venkatesh and Ram Charan in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu