నయనతార లాజిక్ కి నిర్మాతలకు సౌండ్ లేదు

By Srikanya

హైదరాబాద్: నయనతార కెరీర్ విషయంలోనూ కాదు...మాటలలోనూ తన తెలివిని అవసరమైతే ప్రదర్శిస్తుందని మరోసారి రుజువైంది. తనపై వస్తున్న కంప్లైంట్స్ కు ఆమె ఇచ్చిన సమాధానం విని నిర్మాతలకు సౌండ్ లేకుండా పోయింది. ఇంతకి నిర్మాతలకు ఆమెపై కంప్లైంట్ ఏమిటీ అంటే... ఆమె భారీగా రెమ్యునేషన్ తీసుకొంటుంది గానీ, ప్రచారానికి రాదు. సినిమా వేడుకల్లో కనిపించదు. ఇంటర్వ్యూలు ఇవ్వదు.. అని. అయితే ఆమెకు ఆమె ఇచ్చిన కౌంటర్ కి బుర్ర తిరిగుతోంది. ఇంతకీ నయనతార ఏం చెప్పిందో తెలుసా?

నయనతార మాట్లాడుతూ... ''పాటల వేడుకల్లో ఎప్పుడో గానీ కనిపించను. ఇంటర్వ్యూలు ఇచ్చిందీ తక్కువే. కావాలనే దూరమవుతున్నా. దీనికీ కారణం ఉంది. రోజూ.. ప్రతీసారీ నేనే కనిపిస్తే, ప్రేక్షకులకు బోర్‌ కొట్టేస్తుంది. అస్తమానం చూసిన మొహమే ఏం చూస్తారు? తెరపై ప్రత్యేకంగా, అందంగా కనిపిస్తే చాలు. అంతకు మించి కూడా ప్రేక్షకులు ఏం కోరుకోరు..'' అంది.

Nayantara logic about not attending functions

అలాగే....పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో నాకు మీడియా అంటే భయం ఉండేది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలిసేది కాదు. అందరి ముందు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో అర్థమయ్యేది కాదు. అందుకే బయట కనిపించేదాన్ని కాదు. అది అలా అలా అలవాటైపోయింది అని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ సమాధానం విన్న తర్వాత ఆమెకు ఏం చెప్పగలరు చెప్పండి.

పెళ్లి గురించి మాట్లాడుతూ.... ''నేను ఎవరిని పెళ్లి చేసుకొంటానన్న విషయాన్ని రాబట్టడానికి రకరకాలుగా అడుగుతున్నారు. ప్రేమ పెళ్లా లేదంటే పెద్దలు కుదిర్చిందా?అని ఆరా తీస్తున్నారు. నాకు మాత్రం ఏం తెలుసు? నేను విధిని నమ్ముతాను. ఆ క్షణంలో ఏం జరిగితే దాన్ని స్వీకరించడానికి సిద్ధపడతాను. ఆ మనస్తత్వంతో ఉన్నాను కాబట్టే... జీవితంలో ఆటు పోట్లు ఎదురైనా వెంటనే కోలుకోగలిగాను'' అని చెప్పుకొచ్చింది నయనతార.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X