»   » చిరంజీవి సినిమాకే కాదు..బాలయ్య, వెంకీ కూడా తప్పలేదు..అంతలా!

చిరంజీవి సినిమాకే కాదు..బాలయ్య, వెంకీ కూడా తప్పలేదు..అంతలా!

Subscribe to Filmibeat Telugu

నయనతార సౌత్ తిరుగులేని క్రేజ్ తో సూపర్ స్టార్ గా కొనసాగుతోంది. నయనతార క్రేజ్ ఆధారంగా కోలీవుడ్ లో పలువురు దర్శకులు ఆమెతో సోలో హీరోయిన్ సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో మాత్రం సీనియర్ స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు అందుకుంటూ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తునట్లు సమాచారం. నాయనతార బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ వంటి నటులతో ఇప్పటికే నటించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. నయనతార గత కొన్ని చిత్రాల నుంచి ఆమె టాలీవుడ్ లో తీసుకుంటున్న రెమ్యునరేషన్ షాక్ ఇచ్చే విధంగా ఉంది.

Nayanthara quality time with her boyfriend
 తమిళ చిత్రాలతోనే తెలుగులో కూడా

తమిళ చిత్రాలతోనే తెలుగులో కూడా

నాయనతార చంద్రముఖి, గజినీ వంటి తమిళ చిత్రాలతోనే తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత లక్ష్మి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి నయన్ దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

 స్టార్ హీరోలతో సినిమాలు

స్టార్ హీరోలతో సినిమాలు

నయన్ తెలుగులో నాగార్జున, వెంకీ, బాలయ్య మరియు రవితేజ వంటి స్టార్ చిత్రాలలో మెరిసి మెప్పించింది.

 నయనతార ఓ బ్రాండ్

నయనతార ఓ బ్రాండ్

నయనతార దశాబ్దకాలంగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నయన తార ఓ బ్రాండ్ గా మారిపోయింది.

 స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా

స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా

నయనతార ప్రస్తుతం ఎక్కువగా తమిళ చిత్రాలపైనే దృష్టి పెట్టింది. అపుడప్పుడు మాత్రమే నాయతారకు తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. కానీ తెలుగులో రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్ల కంటే ఆమె ఎక్కువగా సంపాదిస్తోందని సమాచారం.

 బాబు బంగారం నుంచే

బాబు బంగారం నుంచే

2016 లో వచ్చిన బాబు బంగారం చిత్రం నుంచే నయన తార టాలీవుడ్ నిర్మాతల నుంచి ముక్కు పిండి వసూలు చేయడం మొదలు పెట్టిందట. ఆ చిత్రానికి గాను నయనతార దాదాపు రూ 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.

 బాలయ్య ఏరికోరి

బాలయ్య ఏరికోరి

నయనతార, బాలయ్య హిట్ పెయిర్. వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో బాలయ్య ఈ ఏడాది విడుదలైన జై సింహా చిత్రానికి నయన్ ని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. తనకున్న క్రేజ్ ని నయనతార బాగానే క్యాష్ చేసుకుంది. ఈ చిత్రానికి కూడా నయన్ మూడు కోట్ల పారితోషకం తీసుకుందట.

తర్జనభర్జన పడ్డ సైరా టీం

తర్జనభర్జన పడ్డ సైరా టీం

మెగాస్టార్ చిరంజీవి చిత్రం సైరా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి మొదట పలువురు హీరోయిన్లని పరిశీలించిన ఆ తరువాత నయనతారని ఎంపిక చేసారు. నయనతార రెమ్యునరేషన్ విషయంలో సైరా టీమ్ కు చుక్కలు చూపించిందట. ఇప్పటికి పెరుగుతున్న క్రేజ్ తో 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అడిగేసిందట. ఇక చేసేది లేక సైరా టీం నయన్ ని ఒకే చేశారు.

 సీనియర్ హీరోయిన్లలో

సీనియర్ హీరోయిన్లలో

ప్రస్తుతం నయనతార సౌత్ లో ఉన్న సీనియర్ హీరోయిన్లలో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. అనుష్క, శ్రీయ వంటి హీరోయిన్లు కూడా మంచి అవకాశాలనే అందుకుంటున్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నయన్ వారందరికీ అందనంత ఎత్తులో ఉంది.

English summary
Nayantara minting crores in Tollywood. Her remuneration gives shock to producers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu