'అరుంధతి' రూట్లో ఎమ్.ఎస్.రాజు!?
ఎమ్.ఎస్.రాజు..తన ఆస్ధాన దర్శకుడు కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఓ హర్రర్ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అర్జెటుగా ట్రెండు తగినట్లుగా ఓ గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ప్రేక్షకులకు అందించి క్యాష్ చేసుకోవాలని ఆశిస్తున్నారు.'అరుంధతి" ఇన్సిప్రేషన్ తో కోడి రామకృష్ణతో ఓ హర్రర్ కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధానపాత్రలో విభిన్న కథాంశంతో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన 'అరుంధతి' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం 'అరుంధతి' చాలా మంది నిర్మాతలకు ప్రేరణగా నిలుస్తోంది.
అలాగే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నయనతారని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నయనతార అప్పట్లో చేసిన చంద్రముఖి ఎఫెక్టు దానికి కొంత కారణమంటున్నారు. దాంతో నయనతార అయినా ఎమ్.ఎస్.రాజుని వరస ఫ్లాఫులనుంచి రక్షిస్తుందా అనేదే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరో ప్రక్క తమిళంలో ఓ వెలుగు వెలిగి ఈ మధ్య కష్టాలు పాలైన నయనతార తెలుగులోనయినా ఏదో విధంగా పూర్తి స్ధాయిలో తన స్ధానాన్ని పదిలపరుచుకునే ఆలోచనలో ఉంది. అందుకోసమే ఎన్టీఆర్ సరసన అదుర్స్ చిత్రం ఒప్పుకుని తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఆమె రవితేజతో చేస్తున్న ఆంజనేయులు కూడా ఆగస్టు పన్నెండున రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే గతంలో కోడిరామకృష్ణ శత్రవు, దేవి, దేవి పుత్రుడు అంటూ ఎమ్.ఎస్.రాజుకి హిట్స్ ఇచ్చారు. అలాగే ఎమ్.ఎస్.రాజు తన కుమారుడుని లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











