నిజమేనా?...నయనతార ‘నైట్ షో’
హైదరాబాద్: ఈ మధ్య నయనతార పేరు వార్తల్లో తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవాతో ప్రమాయణం బెడిసి కొట్టిన తర్వాత అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అదే సమయంలో ఆమెకు వరుస విజయాలు కూడా కలిసి రావడంతో స్టార్ హీరోయిన్‌గా ఇంకా తన హవా కొనసాగిస్తోంది.
కేవలం కమర్షియల్ హంగులు ఉన్న సినిమాలు, స్టార్ హీరోల సరసన అవకాశాలు ఇస్తేనే సినిమాలు చేస్తాను అనే నిబంధనలు ఏమీ పెట్టుకోకుండా...... ఇటు కహానీ లాంటి లేడీ ఓరియోంటెడ్ చిత్రాల్లోనూ, పలు ప్రయోగాత్మచిత్రాలు చేస్తోంది. అంతే కాకుండా రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'లింగా' చిత్రంలో ఐటం సాంగు కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

తాజాగా నయనతార తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి ఒకే చెప్పినట్లు సమాచారం. కొత్త దర్శకుడు అశ్విన్ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించిందట. ఈ చిత్రానికి 'నైట్ షో' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుందని సమాచారం.
ప్రస్తుతం నయనతార చేతిలో దాదాపు అరడజను తమిళ సినిమాలు ఉన్నాయి. పాండి రాజ్ దర్శకత్వంలో శింబు సరసన 'ఐతు నమ్మ ఆలు', ఎం రాజా దర్శకత్వంలో జయం రవి సరసన 'తాని ఓరువన్, జగదీస్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ సరసన 'నాన్‌బెండ' చిత్రంలో, వెంకట్ ప్రభు దర్శకుడిగా సూర్య హీరోగా తెరకెక్కుతున్న 'కళ్యాణ రామన్' చిత్రంతో పాటు అశ్విన్ దర్శకత్వంలో 'నైట్' షో చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











