విరుచుకుపడ్డ నయనతార
ఎంతసేపూ హీరోలేనా..యేం..మేం కనపడమా అంటూ నయనతార విరుచుకుపడుతోంది. హీరోలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి కథలు రాసుకుంటున్న దర్శకులను ఆమె తీవ్రంగా ప్రశ్నిస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తగ్గిపోయాయి అన్నదానికి సమాదానంగా ఆమె ఇలా చెప్పుకొచ్చింది. అంతేగాక ఇది పురుషాధిక్య పరిశ్రమ. అందుకే కథలన్నీ హీరోల చుట్టూనే తిరుగుతాయి. ఆ కథలో అన్నీ వారికే. మాలాంటి హీరోయిన్స్ కేవలం పావులు మాత్రమే అంటూ ఆవేదన చెందుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు మాకూ చేయాలని ఉంటుంది.కానీ అలాంటి కథలు రచయితలు రాయాలి. రాసినా మా వరకూ రావాలి. వచ్చినా.. రిజల్ట్ ఎలా ఉంటుందో అనే బెంగ.. అంటూ చెబుతోంది. అలాగే ఎప్పుడో ఇలాంటి సినిమాలు వస్తాయిని ఎదురుచూడక..అంది వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సింది అంటూ కొత్త వారికి సలహా ఇస్తోంది. అయితే ఛార్మి వంటి వారు వరసగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు కదా అన్నది ఆమెకి తెలియదా అంటున్నారు అది విన్నవారు.


Click it and Unblock the Notifications











