»   »  స్లీపింగ్ పిల్స్ తో నయనతార?

స్లీపింగ్ పిల్స్ తో నయనతార?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nayantara
చెన్నై ఇప్పుడు నయనతార పర్శనల్ లైఫ్ చుట్టూ ఓ రూమర్ ప్రచారమవుతోంది. ఆమె రోజూ స్లీపింగ్ పిల్స్ తీసుకుంటోదని..అవి లేనిదే నిద్ర పట్టడం లేదనీ కథలు కథలుగా చెప్తున్నారు. చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్న ఆమె కీ కర్మ ఏంటి అంటే వరసగా (కథా నాయకుడు,సెల్యూట్) సినిమాలు ఫ్లాఫ్ కావటం, పెంచిన రెమ్యునేషన్ తగ్గించాలని పందెంకోడి ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో చేయబోతున్న చిత్ర నిర్మాత పట్టుబట్టడం ఆమెను నిద్ర నుండి దూరం చేస్తున్నాయుట.
అంతే గాక శింబు మళ్ళీ ఆమెను పదే పదే డిస్ట్రబ్ చేయటం, రాత్రిళ్ళు ఫోన్ లు చేసి విసిగించటం చేస్తున్నాడుట. దాంతో ఒక్కసారిగా అన్ని సమస్యలు ఆమెను చుట్టుముట్టినట్లు ఫీలవుతోంది. అందులోనూ ఆమె ఎదిగే క్రమంలో తన వాళ్ళనీ,స్నేహితులను రకరకాల కారణాలతో దూరంగా పెట్టాల్సి రావటంతో మనస్సు విప్పి చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేక ఇలా స్లీపింగ్ పిల్స్ ని ఆశ్రయిస్తోందని చెప్తున్నారు. రూమర్ కాకుండా ఇదే నిజమే అయితే నయనతార అటువంటి స్ధితికి వెళ్ళకూడదని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X