హాట్ స్టార్ నయనతార దేనికి సింబల్ ?
నయనతార దేనికి సింబల్ అనే డౌట్ ఇప్పుడు కన్నడ ప్రేక్షకులకు కలుగుతోంది. ఆమె తాజాగా కన్నడ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూ 'సింబల్' అనే చిత్రాన్ని కమిట్ అయింది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సరసన ఆమె చేయబోతోంది. ఈ మేరకు బెంగళూరులోని శేషాద్రిపురంలో గల మహాలకి గుడిలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉపేంద్ర హీరోగా చేయటమే కాక దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. కన్నడంలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు పొందిన రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ముందే నయనతార కన్నడ రంగప్రవేశం చేయాల్సి ఉంది. 'కీచక' అనే చిత్రంలో హీరో రవిచంద్రన్ నయనతారను కథానాయికగా నటింపజేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. దాంతో ఈ 'సింబల్'తో తో నన్నా మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన 'సింహా', తమిళంలో ఆర్య పక్కన 'బాస్ ఎన్‌గిర భాస్కరన్' చిత్రాల్లో నటిస్తోంది. మలయాళంలో ఆమె నటించిన 'బాడీగార్డ్' ఇటీవలే విడుదలైంది.


Click it and Unblock the Notifications











