ఎన్టీఆర్ పక్కనెలా వుంటుందో??
ఇటీవలే విడుదలైన రవితేజ సినిమా 'ఆంజనేయులు'. ఈ సినిమా డివైడ్ టాక్ తో ప్రయాణం మొదలు పెట్టి మొత్తానికి యావరేజి చిత్రంగా నిలబడింది. ఈ చిత్రం ఆశించినంత విజయవంతం కాకపోవడానికి ఎన్నో కారణాలున్నా, సినిమా చూసిన వారంతా ముక్తకంఠంతో ఎత్తిచూపిన లోపం మాత్రం నయనతార. తెలుగులో ఇంతకు ముందు నటించిన 'బాస్', 'తులసి', 'దుబాయ్ శీను' చిత్రాల్లో చక్కగా కనిపించిన నయనతార ఆంజనేయులు సినిమాలో అత్యంతదారుణంగా వుండి, జనాన్ని భయపెట్టింది.
నటనాప్రావీణ్యం అంతంతమాత్రమే అయినా తన గ్లామర్ తో నెట్టుకొచ్చే నయన్ తాజా చిత్రం ఆంజనేయులు లో మాత్రం కాస్ట్యూమ్స్ దగ్గర నుండీ హెయిర్ స్టయిల్, ఐ షాడోస్ వరుకు అన్నీ వికారం కలిగించే స్థాయిలో వున్నాయి. అతి హీనమైన మేకప్ తో, జిడ్డు ముఖంతో 'ఆంజనేయులు' కు అతిపెద్ద లోపంగా నిలిచిన నయన్ త్వరలోనే ఎన్టీఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆంజనేయులు' సినిమాలో ప్రేక్షకులు జడుసుకొనేలా చేసిన నయనతార ఎన్టీఆర్ పక్కనెలా వుంటుందోనన్న ప్రశ్న ఇప్పటి టాక్ ఆఫ్ ది మూవీస్....


Click it and Unblock the Notifications











