తులాభారం వేయించుకున్న నయనతార
తులాభారం వేయించుకుని తమ బరువుకు సమానమైన కానుకలను దేవుడికి సమర్పించుకోవడం హిందూ సాంప్రదాయంలో భాగం. ఇటీవల క్రిష్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి మారిన నయన తార కూడా...హిందూ సాంప్రదాయాలను వంటబట్టించుకుంటోంది. ఈ మేరకు కేరళలోని ఓ దేవాలయంలో తులా భారం వేయించుకుని దేవుడికి కానుకలు సమర్పించుకుంది.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం..గురువారం కేరళలోని అలపూజ జిల్లాలోని చెత్తి కులంగర శ్రీ భగవతి దేవాలయంలో తన స్నేహితురాలు లతతో కలిసి వచ్చిన నయనతార తులా భారం వేయించుకున్నట్లు తెలుస్తూంది. తులా భారంలో నయన 50 కిలోల బరువు తూగింది. ఈ మేరకు 50 కిలోల బెల్లాన్ని దేవాలయానికి సమర్పించుకుందట. అంతే కాదు దేవాలయం ట్రస్టు తరుపున చేస్తున్న అభివృద్ధి కోసం కొంత మొత్తాన్ని డొనేషన్ ఇచ్చినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











