రాణా సరసన నయనతార ఖరారు
నయనతార ఇప్పుడు వరసగా సినిమాలు కమిటవుతోంది. తాజాగా ఆమె దగ్గుపాటి రాణా సరసన 'కృష్ణం వందే జగద్గురుం' సినిమా ఓకే చేసింది. గతంలో వెంకటేష్ సరసన తులసి, లక్ష్మి చిత్రాలలో చేసిన ఆమె ఆయన అన్న కుమారుడు రాణా సరసన కూడా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకుముందు కూడా ఇలాగే బాలకృష్ణతో చేస్తూ... మరో ప్రక్క ఎన్టీఆర్ సరసన అదుర్స్ లో చేసింది. ఇక ఇటీవలే నయనతారకు దర్సకుడు క్రిష్ కథ వినిపించారు. నయన పాత్ర తీరుతెన్నులు వివరించారు. వెంటనే ఆమె తన అంగీకారం తెలిపింది. త్వరలోనే రామోజీ ఫిల్మ్‌సిటీలో రాణా-నయనతారలపై సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందిస్తారు. గమ్యం, వేదం చిత్రాలతో క్రిష్ ఓ మేధావి దర్శకుడుగా ప్రశంసలు అందుకున్నారు.
తమిళంలో కూడా వేదం రీమేక్ మంచి మార్కులే వేయించుకుంది.ఇప్పుడు చేస్తున్న సబ్జెక్టు కూడా మానవతా విలువలతో కూడి ఓ మాస్ ఎంటర్టైనర్ ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇక క్రిష్ చిత్రం అంటే ప్రేక్షకుల్లో సైతం నేరేషన్ నుండి అంతా కొత్తగా ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తున్న నేపధ్యంలో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. రాణా ప్రస్తుతం నా ఇష్టం, హిందీలో డిపార్టమెంట్, అందం చిత్రాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











