తగ్గించుకున్న నయనతార
తమిళ నటీ నటులు ఆర్ధిక మాంధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలకు అండదండగా ఉండేదుకు ప్రయత్నిస్తున్నారు. నయనతార తాజాగా రవితేజ సరసన నటిస్తున్న 'ఆంజనేయులు' చిత్రం కోసం తన పారితోషికాన్ని కోటి రూపాయల నుంచి అరవై ఐదు లక్షలకు తగ్గించిందని సమాచారం. అందుకు కారణం ఒకవైపు తమన్నా, అనుష్కల రూపంలో ఎదురవుతున్న గట్టిపోటీ, మరోవైపు ఇటీవల ఆమె నటించిన వరుస చిత్రాల వైఫల్యం. అయితే నయనతార సన్నిహితుల అభిప్రాయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యంలో కేవలం నిర్మాతలను ఆదుకునేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని వారంటున్నారు. ఏదేమైనా నయనతార తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతలకు కాస్త ఊరట కలిగిస్తుందని ఆశిద్దాం.
More from Filmibeat
nayantara anjaneyulu anushka tamanna raviteja tamil star salute vishal నయనతార తమన్నా అనుష్క రవితేజ ఆంజనేయులు తమిళ


Click it and Unblock the Notifications











