నేను ఆటైపు కాదంటూ... స్టార్ హీరోకి నయనతార షాక్
హైదరాబాద్: ప్రస్తుతం భారతీయ సినీరంగంలో ఐటం సాంగుల తీరును పరిశీలిస్తే..... బాలీవుడ్, దక్షిణాది సినిమా రంగాల్లోఈ పాటలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులు ఐటం సాంగులను కూడా మామూలు సాంగులుగానే పరిగణిస్తూ ఉంటారు. అందుకే అక్కడ హీరోయిన్లు కూడా ఐటం సాంగులకు చేయడానికి ఏమాత్రం వెనకాడరు.
అయితే దక్షిణాదిలో మాత్రం ఐటం సాంగులపై ఉన్న అభిప్రాయం వేరు. చాలా మంది ప్రేక్షకులు వాటిని ప్రత్యేక కోణంలో చూస్తారు. వాటిని ఇప్పటికీ బూతు పాటలుగానే పరిగణిస్తున్నారు చాలా మంది. అందుకే దక్షిణాది సినిమాల్లో ఐటం సాంగులు చేయడానికి హీరోయిన్ రేంజి తారలు అస్సలు ఇష్ట పడరు. అలాంటి సాంగులు చేస్తే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, తమకు హీరోయిన్ అవకాశాలు తగ్గుతాయనే భావనలో ఉంటారు. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత మాత్రమే చాలా మంది హీరోయిన్లు గత్యంతరం లేక ఐటం సాంగుల్లో నటిస్తున్నారు.
తాజాగా సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతారకు బాలీవుడ్లో ఐటం సాంగు చేసే అవకాశం వచ్చింది. షారుఖ్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో ఐటం సాంగుకు ఆమె ఫేస్ అయితేనే బాగా సూటవుతుందని దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించగా.... తనకు ఐటం సాంగులు చేయడం ఇష్టం లేదని తెగేసి చెప్పేసింది నయనతార.
నయనతార సినిమా కెరీర్ విషనికొస్తే.... ప్రభుదేవాతో సంబంధం పెటాకులైన తర్వాత మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నయనతారకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఆమె నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రం ఇటీవల విడుదల కాగా, తాజాగా ఆమె అక్కినేని నాగార్జునతో 'గ్రీకు వీరుడు' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇవి కాక ఆమె తమిళంలో వాలాయ్, రాజారాణి, మళయాలంలో ఓ చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











