Don't Miss!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కాళ్ళుపై కెత్తి మరీ ప్రయత్నించేదాన్ని...నయనతార
టీచర్ క్లాసుకు రావడం ఆలస్యమైతే కాళ్ళు పైకెత్తి బ్లాక్ బోర్డు మీద రాయడానికి ప్రయత్నించేదాన్ని. చేతిలో స్కేల్ పట్టుకుని ఇంట్లో గోడలకు పాఠాలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మమ్మనీ, డాడీని, బ్రదర్ ని కూర్చోబెట్టి లెస్సన్స్ చెప్పిన సందర్భాలను తలచుకుంటే తెగ నవ్వొస్తోంది అంటూ చిన్నప్పుడు సంగతులు గుర్తు చేసుకుంది నయనతార. రీసెంట్ గా ఆమె తమిళంలో చేసిన 'బాస్కర్ ఎన్ గిర బాస్కిరన్' చిత్రం తెలుగులో డబ్బింగై 'నేనే అంబాని' పేరుతో విడుదలైంది. ఆ చిత్రంలో ఆమె లెక్చరర్ గా కనిపిస్తుంది. ఆ పాత్ర గురుంచి చెబుతూ..."చంద్రిక పాత్రలో నటిస్తున్నంత సేపు నాకు చిన్నప్పటి జ్ఞాపకాలే. చిన్నప్పుడు స్కూల్‌కి బుద్ధిగా వెళ్ళేదాన్ని.
పెద్దయ్యాక ఏమవుతావు నన్ను ఎవరైనా అడిగితే టీచర్ అని ఆలోచించకుండా చెప్పేదాన్ని. కానీ ఢిల్లీలో కొన్నాళ్ళు, బెంగుళూరులో కొన్నాళ్ళు చదువుకున్న తర్వాత టీచర్ కావాలన్న ఆ కోరికలన్నీ మాయమైపోయాయి. సినిమాల్లోకి వచ్చాక అవన్నీ ఇలా నటన రూపంలో తీరుతున్నాయి అని చెప్పుకొచ్చింది. ఆర్య, నయనతార కాంబినేషన్ లో విడుదలైన నేనే అంబాని చిత్రం భాక్సీఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ కామిడీ సినిమాకి కావల్సినంత పబ్లిసిటీ చేయకపోవటమే ఫెయిల్యూర్ కి కారణం అంటున్నారు.
జీవా ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో లక్ష్మి, చిత్ర లక్ష్మణన్, విజయలక్ష్మి, సంతానం, పంజు సుబ్బు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, కెమెరా: శక్తి శరవణన్, కూర్పు: వివేక్, కళ: జాక్సన్, నృత్యాలు: దినేష్, ఫైట్స్: రాజశేఖర్, దర్శకత్వం: రాజేష్.ఎం.