Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రం స్పెషాలిటీలు ఇవే..
ఎంతో హైప్ తో రిలీజ్ కు రెడీ అవుతున్న ఎన్టీఆర్ తాజా చిత్రం అదుర్స్ లో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసారు. అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా నయనతార,షీలా అతనికి జోడీగా కనిపించనున్నారు. వీటికి తోడు భిళ్లా తో తొలిసారిగా బికినీ వేసిన నయనతార ఈ చిత్రంలోనూ మరోసారి బికినీలో కనిపించి కనువిందు చేయనుంది. ఇవే కాక అందాల భామ ఛార్మీ ఓ ఐటం సాంగ్ లో తన అందచందాలు ఒలకపోయనుంది. ఈ చిత్రంకోసం లవకుశ,అదుర్స్,వాడే వీడు టైటిల్స్ ను ఎన్నుకున్నారు. చివరకు అదుర్స్ ఫైనలైజ్ చేసారు. రెండు పాత్రల్లో ఒకటి భ్రాహ్మణ పాత్ర,మరొకటి డాన్ పాత్ర అని తెలుస్తోంది. సెకెండాఫ్ లో ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్లినప్పుడు వచ్చే కామిడీ హిలేరియస్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ నెల 18న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి వివివినాయిక్ దర్శకత్వం వహిస్తే కోనవెంకట్ కథ-మాటలు అందించారు. అలాగే ఈ చిత్రం పూర్తి స్టాయి కామిడీ ఎంటర్టైనర్. దేవీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో ఈ నెల ఐదున శిల్ప కళా వేదికలో రిలీజ్ అవుతోంది. ఇందులో మహేష్ ముంజ్రేకర్ విలన్ గా చేసారు. మహేష్ ముంజ్రేకర్ గతంలో గోపీచంద్ ఒక్కడున్నాడు చిత్రంలో విలన్ గా చేయటం తెలిసిందే.