ఎన్టీఆర్ తో నయనతార

ఇదే కోవలో పూరీ,పవన్ సినిమాలోనూ ఆమె ఆఫర్ సంపాదించింది. ఇప్పుడు ఏకంగా ఇలియానాకే ఎసరు పెట్టి మరీ ఈ ప్రాజెక్టులోకి దూరింది. అయితే ఇలియానా కాలికి ఈ మధ్య చిన్నపాటి గాయం కావడంతో కాల్షీట్లు సర్దుబాటు సమస్య వచ్చింది అందుకే ఈ మార్పు అని చెప్పటం జరుగుతోంది. ఇక వైష్ణవి ఆర్ట్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల్నీ,ఫైట్స్ నీ తెరకెక్కించారు. ఇక ఎన్టీఆర్ - నయన కలిసి నటించే తొలి చిత్రమిదే. అలాగే రెండో నాయిక అవకాశం 'చిరుత' భామ నేహా శర్మకి దక్కిందనే సంగతి తెలిసిందే. ఈ నెల చివరి వారం నుంచి మరో షెడ్యూల్ మొదలవుతుంది.ఇక నయనతార స్పీడు చూస్తూంటే మరెంతమంది హీరోయిన్స్ కీ ట్విస్ట్ ఇస్తుందో నని అంతా అంటున్నారు.


Click it and Unblock the Notifications











