రవితేజకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయనతార!
పెళ్లి వరకు వచ్చిన ప్రభుదేవా-నయనతారల వ్యవహారం బెడిసి కొట్టిందని, ఇద్దరూ ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకునే ప్రయత్నంలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా కోరిక మేరకు అప్పట్లో సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నయనతార కూడా ఈ పరిణమాలతో ప్రస్తుతం పలు సినిమాలకు సైన్ చేస్తోంది. ఇటీవల నాగార్జునతో నటించడానికి ఓకే చెప్పిన ఈ వయ్యారి తాజాగా రవితేజతో కలిసి ఓ సినిమాలో నటించేందుకు కూడా అంగీకారం తెలిపిందని సమాచారం.
ఇటీవల జనవరి 25న రవితేజ బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీకి నయనతారను ప్రత్యేకంగా ఆహ్వానించిన రవితేజ ఆమె రీ ఎంట్రీ గురించి ఆరా తీశాడని, తన సినిమాలో నటించాలని కోరాడని, అందుకు నయనతార కూడా ఓకే చెప్పిందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం. మరో వైపు నయనతారకు తెలుగు, తమిళంలో బోలెడు ఆఫర్లు వస్తున్నాయని, అయితే నయనతార ఇప్పటి వరకు నాగార్జున సినిమాకు తప్ప వేటికి ఒప్పుకోలేదని, తాజాగా రవితేజకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. గతంలో నయనతార దుబాయ్ శ్రీను, ఆంజనేయులు చిత్రాల్లో రవితేజతో కలిసి రొమాన్స్ చేసింది.


Click it and Unblock the Notifications











