నయనతార రీ ఛార్జ్ కి అది చెయ్యాల్సిందే!

నయనతార తాజాగా సెల్యూట్ సినిమాలో ఓ హాట్ సాంగ్ లో చాలా సెక్సీగా కనిపించంటం మనం అందరం గమనించిందే.అసలు ఆ నృత్య భంగిమలే కాక ఆమె శరీరంలో కొత్తగా కనిపిస్తున్న స్లిమ్ ఒంపుసొంపులు అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసాయి.అయితే ఈ హాట్ ఫిగర్ మేకింగ్ కి ,ఈ రిలాక్సేషన్ టెక్నిక్ కి చాలా దగ్గర సంభంధం ఉంది. అసలు ఆమె ఫిగర్ ఆ షేప్ కి రావటానికి తాను పడ్డ శ్రమ లోనే ఈ విషయాన్ని ఆమె కనుక్కుందిట. అలాగే ఆ శ్రమ తక్కువేం కాదని అలాగే ఓవర్ నైట్ లో సాధించిందేం కాదని ఆమె ఆ సీక్రెట్స్ తమిళ మీడియాకు వివరించింది. అందులో మాటగా ఈ అసలు విషయాన్ని చెప్పేసింది.
ఇక ఆమె మాటల్లో సైజ్ జీరో ఫిగర్ కోసం నేను రోజు థ్రెడ్ మిల్ పై గంటలు తరబడి కష్టపడటమే కాక నా ఇష్టాలన్నీ బలవంతంగా చంపుకుని డైటింగ్ చేసాను.అయినా షేప్ వస్తోంది కానీ ఫెరఫెక్షన్ రావటం లేదు. దాంతో నిరాశలో ఉన్న నాకు విశాల్ దారి చూపించాడు. అతను అప్పటికే సిక్స్ పాక్ బాడీ బిల్డింగ్ పనిలో ఉన్నాడు. అతని ఫిజికల్ ట్రైనర్ ప్రసాద్ అనే ఆయన్ని పరిచయం చేసాడు. అంతే అక్కడనుండి ఆయన పర్యవేక్షణలో మీరు ఇప్పుడు చూస్తున్న షేప్ లను సంపాదించాను అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే పనిలో పనిగా ఆ ఫిజికల్ ట్రైనర్ ప్రసాద్ ని పొగడ్తలలో ముంచేసింది. నా చేత రోజూ ఆయన చెన్నైలో రెండు గంటల పాటు వర్కవుట్స్ చేయంచేవారు...నేను బాగా ఎంజాయి చేసాను. ఇక ఆ సెషన్స్ పూర్తయ్యేటప్పుడు బాగా రీఛార్జి అయ్యేదాన్ని. అవి ఎంత బాగా నాకు నచ్చాయంటే నా జీవితంలో అదో భాగం అయిపోయాయి. ఎప్పుడైనా విసుగు,కోపం కల్గినప్పుడు, పూర్తి స్ధాయి అలసట అనిపించినప్పుడు రీఛార్జ్ అవ్వాలంటే వెంటనే నా పర్శనల్ జిమ్ లోకి వెళ్ళి కూల్ గా రిలాక్స్ అవుతాను అంది. అదీ నయనతార రీఛార్జి టెక్నిక్...


Click it and Unblock the Notifications











