ప్రభు దేవాపై నయనతార రివెంజ్?
హాట్ బ్యూటీ నయనతార ప్రభుదేవాపై రివేంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుందా? ఈ మేరకు తన కార్యకలాపాలను వేగవంతంగా కానిస్తుందా? అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. రివేంజ్ తీర్చుకోవడం అంటే మరోదే కాదు...ప్రభుదేవా నొచ్చుకునే పనులు చేయడమే.
మహిళలు సాధారణంగా ఒక మగాన్ని బాగా ఇష్ట పడ్డారంటే వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. అదే సమయంలో తమకు ఇష్టమైన మగాళ్లపై ద్వేషం పెంచుకుంటే వాళ్లు నొచ్చుకునేలా..వాళ్లకు ఇష్టంకాని పనులు చేస్తుంటారు. ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు నయనతార వ్యవహారం దాదాపుగా పెళ్లి వరకు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రభుదేవా కోసం క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి మారడమే కాదు...సినిమాలకు కూడా పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శ్రీరామరాజ్యం సినిమా తర్వాత నయనతార ఏ సినిమాలు కూడా ఒప్పుకోలేదు. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి వీరి మధ్య విబేధాలు వచ్చాయి. ప్రేమ పెటాకులైంది.
దీంతో ప్రభుదేవాపై రివేంజ్ తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్న నయన....ప్రభుదేవాకు ఇష్టం కాని పనులు చేయడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఎడాపెడా సినిమాలకు సంతకాలు చేసేస్తోంది నయన. అంతేకాదు బాలీవుడ్లో ఐటం సాంగు కూడా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తొలుత చేయడానికి కాస్త ఆలో చించినా...కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తామనడంతో ఓకే చెప్పిందట. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం బాలీవుడ్లో ప్రభుదేవా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన 'రౌడీ రాథోడ్'చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈనేపథ్యంలో ఐటం సాంగు చేయడం ద్వారా ప్రభుదేవాను నొప్పించడంతో పాటు తమ మ్యాటర్ బాలీవుడ్ జనాల నోళ్లలో నాని అతను ఇబ్బంది పడటమే లక్ష్యంగా పెట్టుకుందట నయనతార.


Click it and Unblock the Notifications











