పండగ పూట నయనతారకు షాక్, గిఫ్టులన్నీ వదిలేసి...
హైదరాబాద్: ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్ నయనతార ఈ నెల 25న క్రిస్‌మస్ పండగను తన సొంతూర్లో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య జరుపుకునేందుకు చెన్నై నుండి కొచ్చికి విమానం టిక్కెట్ బుక్ చేసుకుంది. క్రిస్‌మస్ పండగ సందర్భంగా సన్నిహితులకు, స్నేహితులకు గిఫ్టులు ఇవ్వడం ఆనవాయితీ.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇందులో భాగంగా సన్నిహితుల కోసం నయనతార భారీగా గిఫ్టులు కొనుగోలు చేసింది. అన్నీ కలిసి ఐదు పెద్ద లగేజ్ బ్యాగులు నిండిపోయాయి. ఎయిర్ పోర్టుకు ఈ బ్యాగులన్నింటితో బయల్దేరిన ఆమెకు విమానాశ్రయ అధికారులు వాటిని విమానంలో తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. అందుకు కారణం ఆమె లేటుగా రావడమే. సాధారణంగా నిర్ణీత సమయం దాటిని తర్వాత లగేజీని అనుమతించరు.
నయనతార ఎంత రిక్వెస్ట్ చేసినా.....సమయం మించి పోవడంతో అధికారులు కనిరించలేదు. దీంతో చేసేది లేక గిఫ్టులన్నీ చెన్నైలోనే వదిలేసి కొచ్చి బయల్దేరింది నయన. పండగ పూట ఇలాంటి అనుభవం ఎదురు కావడంపై నయనతార నిరాశకు లోనైందట. ఈ విషయం ఇపుడు తమిళ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
నయనతార ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ‘నాన్ బెండ', ‘నైట్ షో' చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ‘ఐదు నమ్మ ఆలు', ‘మాస్', ‘తాని ఒరువన్', ‘నానుమ్ రౌడీ దాన్', ‘భాస్కర్ ది రాస్కెల్' చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











