»   »  ఆ సినిమా చూసి భయపడకుంటే 5 లక్షల బహుమతి

ఆ సినిమా చూసి భయపడకుంటే 5 లక్షల బహుమతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘మయూరి'. తమిళంలో ‘మాయ' పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై సి.కళ్యాణ్ అందిస్తున్నారు. ఏక కాలంలో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తయారయ్యిందనీ, టెక్నికల్ గా ఉన్నతస్థాయిలో రూపొందిన ఈచిత్రాన్ని తెలుగులో అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని కళ్యాణ్ తెలిపారు.

ఈ హర్రర్ సినిమాను చూసి ఎవరయినా భయపడకుండా ఉంటే రూ.5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ఈ సినిమా నిర్మాతలు సవాల్ విసురుతున్నారు. సెప్టెంబరు 17న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇది ఆద్యంతం ఊపిరిబిగపట్టించే సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓ పసిపాప తల్లిగా నయనతార ఈ చిత్రంలో కనిపిస్తుంది. కథ ఆమె కేరక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె కెరర్లోని బెస్ట్ ఫిలిమ్స్‌లో తప్పకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

 Nayantara's Mayuri to release on Sep 17th

థ్రిల్లర్ కాబట్టి సహజంగానే ఇందులో మాటలకంటే దృశ్యానికే ఎక్కువ ప్రాధాన్యం. రీ రికార్డింగ్, విజువల్ ఎపెక్ట్స్ హైలెట్ అవుతాయి. వాటి కారణంగా ఈ సినిమాకు హాలీవుడ్ ఫిల్మ్ లుక్ వచ్చింది. రీ రికార్డింగ్ హంగేరీలో జరిపారు సంగీత దర్శకుడు రాన్ ఎథన్ యొహాన్. 24 ఏళ్ల ఓ కొత్త దర్శకుడితో నయనతార పని చేసిదంటే, ఈ సినిమా కథనం ఆమెను ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది అంటున్నారు నిర్మాతలు.

ఈ సినిమాకు సంబంధించిన శరవణన్ రూపొందించిన ఫైలట్ సీన్ చూసి, ఇంప్రెస్ అయి ఈ సినిమా చేసింది. ఇందులో మూడు పాటలుంటాయి. ఆరి, అంజాద్ ఖాన్, మైమ్ గోపీ, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, రోబో శంకర్, శరత్ తారాగణమైన ‘మయూరి' చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్, కూర్పు: టి.ఎస్: సురేష్, కళ: రామలింగం.

English summary
Nayanthara played the mother of a toddler in a thriller titled 'Mayuri' release on Sep 17th. This film will be released in Tamil as 'Maya' and C.Kalyan is presenting the film to the Telugu audiences on C.K.Entertertianments and Sri Shuba Swetha films banners.
Please Wait while comments are loading...