వారి కంటపడకుండా నయనతార రహస్య యాత్ర
నయనతార, ప్రభుదేవా త్వరలో పెళ్ళికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రభుదేవాను పెళ్ళి చేసుకోవడం కోసం ఇటీవల చ్నైలోని ఆర్యసమాజ్ లో మతం మార్చుకుంది నయనతార. అయితే క్రిస్టియన్ అయినటువంటి ఆమె మతం మార్చుకోవడం చెల్లదని, నయనతార ఒక్కసారి క్రిష్టియన్ గా మారిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ మతం మార్చుకునే వీలులేదని చ్నైకి చెందిన క్రిష్టియన్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వారి కంటపడుకుండా తిరుగుతున్న నయనతార ఈ మధ్య ప్రభుదేవాను కలుసుకోవడానికి రహస్యంగా ముంబై వెళ్లిందని కోలీవుడ్ సమాచారం. తెలుగులో విజయవంతమైన 'విక్రమార్కుడు" చిత్రాన్ని 'రౌడీ రాథోడ్" పేరుతో ప్రభుదేవా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
అక్షయ్ కుమార్, సొనాక్షీసిన్హా జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ కార్యక్షికమంలో పాల్గొనడం కోసమే నయనతార ముంబై వెళ్లిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కానీ ప్రభుదేవా తన సన్నిహితులందరికి ఓ పార్టీని ఏర్పాటు చేశాడని అందులో పాల్గొనడం కోసమే నయనతార ముంబై వెళ్లిందని కోలీవుడ్ చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా ప్రభుదేవాతో ప్రేమవ్యవహారం మొదలుపెట్టినప్పటినుంచి ఈ మలయాళ భామ వివాదాలతో సహవాసం చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.


Click it and Unblock the Notifications











