»   » రూ.కోటి ఆఫర్: నయనతార ప్రచారం చేస్తుందా?(ఫోటోలు)

రూ.కోటి ఆఫర్: నయనతార ప్రచారం చేస్తుందా?(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సౌతిండియాలో టాప్ పొజిషన్లలో కొనసాగుతున్న హాట్ హీరోయిన్లలో నయనతార ఒకరు. చాలా కాలం ఆమె సినిమాల్లో నటించడం మినహా....సైడ్ ఇన్‌కం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. సైడ్ ఇన్‌కం అంటే మరేదో కాదండీ పలు వ్యాపార ప్రకటనల్లో నటించడం.

చాలా కాలంగా నయనతార వ్యాపార ప్రకటనలకు దూరంగానే ఉంటోంది. అయితే ఎలాగైనా నయనతారను ఇందుకు ఒప్పించాలని కళానికేతన్ గ్రూపు సంస్థ ప్రయత్నిస్తోంది. రూ. కోటి ఆఫర్ చేసి తమ గ్రూపులోని శ్రీనికేతన్ తరుపున ప్రచారం చేయించేందుకు ట్రై చేస్తున్నారట.

రూ. కోటి ఆఫర్ కావడంతో నయనతార సుముఖంగా ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి నయనతార అగ్రిమెంటుపై సైన్ చేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో 2010లో పోతీస్ సంస్థ దీవాళీ కలెక్షన్ తరుపున నయనతార ప్రచారం చేసింది. ఆ తర్వాత ఆమె ఏ వ్యాపార ప్రకటనల్లోనూ నటించలేదు.

ఫిల్మ్ స్టార్స్ అండ్ ఎండార్స్‌మెంట్ డీల్స్

ఫిల్మ్ స్టార్స్ అండ్ ఎండార్స్‌మెంట్ డీల్స్

సినిమా రంగంలో టాప్ సెలబ్రిటీలుగా వెలుగొందుతున్న వారికి వ్యాపార ప్రకటనల్లో నటించడం మంచి సైడ్ ఇన్‌కంగా మారింది. వీటిల్లో నటించడం ద్వారా పెద్దగా కష్టపడకుండానే ఎక్కవ మొత్తంలో సంపాదిస్తున్నారు.

నయనతార తోటి హీరోయిన్ల డీల్స్

నయనతార తోటి హీరోయిన్ల డీల్స్

నయనతార తోటి హీరోయిన్లయిన అసిన్, త్రిష, అనుష్క శెట్టీ, కాజల్ అగర్వాల్ తదితరులు వివిధ పెద్ద పెద్ద చీరల దుకాణాల తరుపున ప్రచారం చేస్తున్నారు. వారు ఒక్కో డీల్‌కు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు.

నయనతార ఎందుకు దూరంగా ఉంటోంది?

నయనతార ఎందుకు దూరంగా ఉంటోంది?

ఇతర హీరోయిన్లతో పోలిస్తే నయనతారకు ఉన్న స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఆమె డిమాండ్ చేస్తే ఎంత ఇవ్వడానికైనా ఆయా సంస్థలు రెడీగా ఉన్నాయి. కానీ ఎందుకో మొదటి నుంచి వ్యాపార ప్రకటనల్లో నటించడానికి ఆసక్తి చూపడం లేదు.

అలా చెప్పడం నయనకు ఇష్టం ఉండదు

అలా చెప్పడం నయనకు ఇష్టం ఉండదు

మీరు ఎందుకు వ్యాపార ప్రకటనల్లో నటించడం లేదని అడిగితే....‘నేను పలానా సబ్బు వాడటం లేదు, అలాంటపుడు నా బ్యూటీ సీక్రెట్ ఆ సబ్బే అని ఎలా చెప్పను? సాఫ్ట్ డ్రింకులు తాగడం నాకు ఇష్టం ఉండదు. అలాంటపుడు నా ఎనర్జీ సీక్రెట్ అదే అని ప్రేక్షకులను నమ్మించడం ఇష్టం ఉండదు' అని అంటోంది.

నయనతార ఒప్పుకుంటే...?

నయనతార ఒప్పుకుంటే...?

నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటే చాలా వ్యాపార సంస్థలు ఆమెతో ప్రచారం చేయించడానికి రెడీగా ఉన్నాయి. ఒక్కసారి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమె కోసం క్యూ కడతారని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

English summary
Nayantara is one of the most sought after actresses in South Indian film industry. In recent years, she is the only actress, who has rejected many plum offers in both Telugu and Tamil film industries. She is also the only actress, who has always shied away from lucrative endorsement deals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu