»   » పవన్-వెంకటేష్ మూవీలో నయనతార, షూటింగ్ డీటేల్స్!

పవన్-వెంకటేష్ మూవీలో నయనతార, షూటింగ్ డీటేల్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో హిందీ హిట్ మూవీ 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా ఓ తెలుగు చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. తాజా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నయనతార కూడా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేష్ సరసన నయనతార జంటగా నటిస్తున్నట్టు సమాచారం.

'తడాఖా' ఫేం డాలీ (కిషోర్ కుమార్) దర్స్ఘకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుందని తలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. హిందీలో ఈ పాత్రను అక్షయ్ కుమార్ పోషించారు. హిందీలో రేష్ రావల్ పోషించిన పాత్రలో వెంకటేష్ నటిస్తారు.

Nayantara to star in 'Oh My God' telugu remake

పవన్ స్వయంగా పార్టీ పెట్టి ప్రచారంకి వెళ్తూన్న నేఫధ్యంలో ఈ చిత్రం ఉంటుందా..ఉండదా..వేరే హీరో వచ్చి పవన్ ప్లేస్ ని రీ ప్లేస్ చేస్తాడా అనే ఊహాగానాలు అంతటా వినిపించాయి. ఆ వార్తలకు తెరదించుతూ పవన్ ఈ ప్రాజెక్టు ఓకే చేసారు. మే నెల రెండో వారం నుంచీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాసం ఉంది. అప్పటికి ఎలక్షన్స్ ముగియనుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు శర వేగంగా స్క్రిప్టు రెడీ అవుతోంది. తెలుగు నేటివిటికి తగినట్లు స్క్రిప్టు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని, దానిపై కసరత్తు జరుగుతోందని చెప్తున్నారు.

హిందీ మూవీ 'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary

 Nayantara to star in Oh My God telugu remake. The yet-untitled Telugu remake of "Oh My God", which features Daggubati Venkatesh and Pawan Kalyan in the lead, will most likely hit the screens on Gandhi Jayanti on Oct 2. "The film will go on floors soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu