»   » నయనతార మనసులో ప్రభుదేవాకు ఇంకా చోటుందా?

నయనతార మనసులో ప్రభుదేవాకు ఇంకా చోటుందా?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ప్రభుదేవా-నయనతార ప్రేమ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వీరు పెళ్లి ఏర్పాట్ల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయతే విబేధాలు రావడంతో విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే వీరు విడిపోయిన పరిణామాలు మాత్రం ఆవేశపూరితంగా జరిగినవే అని చెప్పక తప్పదు.

  అయితే నయనతార మనసులో ఇంకా ప్రభుదేవాకు చోటుందా? అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. తమిళ మూవీ 'ఐదు కథిర్వెలన్ కాదల్' ప్రమోషన్స్ సందర్భంగా చెటు చేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

  నయనతార-ప్రభుదేవా లవ్ స్టోరీ
  విజయ్ హీరోగా తెరకెక్కిన 'విల్లు' చిత్రం సందర్భంగా నయనతార-ప్రభుదేవా మధ్య ప్రేమ చిగురించింది. శింబుతో బ్రేకప్ అయిన తర్వాత అప్పుడప్పుడే మానసికంగా కోలుకున్న నయనతార ప్రభుదేవా వైపు ఆకర్షితురాలైంది. అయితే అప్పటికే ప్రభుదేవాకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. అనేక వివాదాల అనంతరం ప్రభుదేవా తన భార్యకు విడాకులిచ్చారు.

  నయనతార తన సినిమా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి సినిమాలకు శాశ్వతంగా దూరం కావాలని నిర్ణయించుకుంది. క్రిస్టియన్ అయిన నయన, ప్రభుదేవా కోసం మతం కూడా మార్చుకోవాలని డిసైండైంది. వ్యవహారం ఇంత వరకు వచ్చిన తర్వాత వీరు విడిపోవడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

  ప్రత్యేకమైన ఇష్టం

  ప్రత్యేకమైన ఇష్టం

  ప్రభుదేవాతో విడిపోయినప్పటికీ....ఆయనంటే నయనతార మనసులో ఇంకా ఎక్కడో తెలియని ఇష్టం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుదేవా పేరు వింటే చాలు ఆమె మొహం ఎరుపెక్కిపోతోంది.

  ప్రభుదేవా ప్రస్తావన

  ప్రభుదేవా ప్రస్తావన

  తమ తాజా సినిమా ‘ఐదు కథిర్వెలన్ కాదల్' ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో హీరో ఉదయనిధి స్టాలిన్, నయనతార పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ ప్రభుదేవా ప్రస్తావన తెచ్చారు.

  నయనతార ఫేసు ఎరుపెక్కిన వైనం..

  నయనతార ఫేసు ఎరుపెక్కిన వైనం..

  ఉదయ నిధి స్టాలిన్ ప్రభుదేవా ప్రస్తావన తెస్తూ.....సినిమా చిత్రీకరణ సమయంలో కొరియోగ్రాఫర్ కొన్ని కష్టమైన స్టెప్స్ చేమయని చెప్పారు. కానీ నేను ప్రభుదేవా లాంటి డాన్సింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తిని కాదు కాబట్టి నా వల్ల కాదని చెప్పాను అని ఉదయనిధి స్టాన్ టీవీ షోలో తెలిపారు. ఈ సమయంలో ఉదయనిధి స్టాలిన్ పక్కనే ఉన్న నయనతార ఫేసు ప్రభుదేవా ప్రస్తావన రావడంతో ఎరుపెక్కింది.

  రూమర్లు ప్రచారంలోకి...

  రూమర్లు ప్రచారంలోకి...

  ప్రభుదేవా పేరు వినగానే నయనతార ఫేసు ఎరుపెక్కడం, సిగ్గుమొగ్గలేస్తుండటంతో పలు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె మనసులో ప్రభుదేవాకు చోటు ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

  నయనతార చేస్తున్న సినిమాలు

  నయనతార చేస్తున్న సినిమాలు

  ప్రస్తుతం నయనతార చేతిలో మల్టిపుల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఐదు కథిర్వెలన్ కాదల్' చిత్రంతో పాటు, నీ ఎంగె ఎన్ అంబె, నాన్బెండ తదితర సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

  English summary
  Nayantara may have hard-headedly walked out of Prabhu Deva's life, but the actress seems to be still having a special place for him. The signs were visible during one of the promotions of recent movie Idhu Kathirvelan Kadhal.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more