లవ్‌స్టోరీకి బ్రేక్ : దుబాయ్‌లో నయనతార ఎంజాయ్..!

By Bojja Kumar

హైదరాబాద్ : సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార ప్రభుదేవాతో లవ్ ఫెయిల్ అయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు సైన్ చేసి క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.

తాజాగా నయనతార లవ్ స్టోరీకి బ్రేక్ ఇచ్చింది. లవ్ స్టోరీ అంటే ఇంకేదో అనుకోవద్దు...! ప్రస్తుతం నయనతార నాగార్జునకు జోడీగా 'లవ్ స్టోరీ' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార క్రిస్టియన్ మతస్తురాలు కావడంతో క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని షూటింగుకు బ్రేక్ ఇచ్చి హాలిడేస్ తీసుకుంది.

నయనతార సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆమె ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిందని, క్లోజ్ రిలేటివ్స్‌తో క్రిస్‌మస్ వేడుకల్లో పాల్గొంటూ ఎంజయ్ చేస్తోందని సమాచారం. గతంలో ప్రభుదేవాతో ప్రమాయణం నేపథ్యంలో నయనతార హిందూ మతంలోకి మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె క్రిస్ మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడాన్ని బట్టి చూస్తే తిరిగి ఆమె క్రిస్టియన్ మతాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

'లవ్ స్టోరీ' సినిమా విషయానికొస్తే...
అక్కినేని నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రానికి తాత్కాలికంగా 'లవ్ స్టోరీ' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం దర్శక నిర్మాతలు ఈ చిత్రానికి టైటిల్ మార్చి, అఫీషియల్ టైటిల్ ప్రకటించేందుకు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఈచిత్రం కోసం 'చంద్రుడు', 'ప్రేమికుడు' అనే రెండు టైటిళ్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే వీటిలో ఏదో ఒకటి ఫైనల్ కానుంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'లవ్ స్టోరీ'లో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X