అందాల నయనతార మెగా హీరోల పక్కన డ్యాన్స్ బొమ్మలా కాకుండా హీరోయిన్ ప్రధానంగా సాగే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? అనుష్క ప్రధాన పాత్రలో నటించిన "అరుంధతి" సినిమా కనకవర్షం కురిపిస్తోంది. దానితో పెద్ద నిర్మాతలు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల మీద దృష్టి సారిస్తున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో మెగా నిర్మాత ఎంఎస్ రాజు అరుంధతి వంటి గ్రాఫిక్ మార్వెల్ ను తీయడానికి సిద్ధమవుతున్నారు. పదేళ్ళ క్రితం వీరి కాంఇబినేషన్ లో వచ్చిన "దేవి" సినిమా పెద్ద హిట్ అయింది. నయనతారతో సినిమా తీస్తున్నట్టు కోడి ధృవీకరించారు కానీ నిర్మాత పేరు చెప్పడానికి ఆయన సంకోచిస్తున్నారు.