»   » అది కనిపించకుండా కవర్ చేసిన నయనతార!

అది కనిపించకుండా కవర్ చేసిన నయనతార!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొన్ని రోజుల క్రితం 'అమర కావ్యం' అనే తమిళ సినిమా ఆడియో వేడుకకు హాజరైన నయనతార......తన చేతిపై ఉన్న టాటూ కనిపించేలా డ్రెస్సు వేసుకొచ్చి మీడియాలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఆ టాటూ ఆమె మాజీ ప్రియుడు ప్రభుదేవాకు సంబంధించినది కావడమే!

అప్పుడు టాటూను పట్టించుకోకుండా ఏమరపాటుగా ఉన్న నయనతార ఇటీవల జరిగిన 61వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించిందంటూ తమిళ మీడియాలో మళ్లీ వార్తల హడావుడి మొదలైంది. ఆ టాటూ కనిపించకుండా చీర కట్టుతో హాజరైందని, ఆమె స్లీవ్ లెస్ జాకెట్ ధరించినప్పటికీ....టాటూ ఉన్న వైపు తన చీర కొంగుతో కవర్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఆ టాటూను చూపించినా...చూపించ కుండా కవర్ చేసినా..వార్తే మరి!

నయనతార, ప్రభుదేవా ప్రేమయాణం...ఆపై బ్రేకప్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సౌత్‌ సినీ చరిత్రలోనే గతంలో కనీవినీ ఎరుగని రీతిలో వీరి ప్రేమాయణం గురించిన విషయాలు ఆ మధ్య మార్మోగాయి. నయనతార కోసం ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇవ్వడం అప్పట్లో ఓ సంచలనం.

Nayantara Tries To Cover 'Prabhu Deva' Tattoo

ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎంత ప్రేమ ఒలకపోసుకున్నారో మాటల్లో, రాతల్లో చెప్పడం కష్టమే. ప్రభుదేవా తనపట్ల చూపెడుతున్న లవ్వుకు ఫిదా అయిపోయిన నయనతార అతని పేరును తన చేతిపై పచ్చబొట్టు కూడా పొడిపించుకుంది. ప్రభుదేవానికి పెళ్లి చేసుకోవడానికి తన మతం మార్చుకుని హిందూ మతం కూడా స్వీకరించాలని నిర్ణయించుంది.

వీటన్నింటికంటే ముఖ్యంగా ప్రభుదేవా కోసం తనకు ఎంతో ప్రాణమైన సినిమాలకు కూడా దూరం కావాలని నిర్ణయించుకుంది. ఇలా ప్రభుదేవా కోసం ఎన్నో త్యాగాలు చేసింది నయనతార. ఏమైందో తెలియదు కానీ నయనతార మనసు విరిగిపోయింది. అతనితో తెగదెంపులు చేసుకుంది. ప్రభుదేవాతో విడిపోయి చాలా కాలం అయినా....నయనతారను అతని ప్రేమగుర్తులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె చేతిపై ప్రభుదేవా పేరుతో ఉన్న టాటూ ఇంకా అలానే ఉంది.

English summary
Nayantara had flaunted her ex-beau Prabhu Deva's tattoo in her arm at the audio launch function of Amara Kaaviyam and it had become a topic to debate for all the gossip mongers. Now, the actress seems to have learnt the lesson and it was obvious after she tried to hide it from shutterbugs at an awards function recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu