»   » దర్శకుడితో నయనతార ఎఫైర్, ఫోటోలు హల్ చల్..(?)

దర్శకుడితో నయనతార ఎఫైర్, ఫోటోలు హల్ చల్..(?)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార ప్రొఫెసన్ పరంగా ఎప్పుడూ టాప్ పొజిషన్లోనూ ఉంటూ వస్తోంది. అదే సమయంలో ఎఫైర్లు, ప్రేమ వ్యవహారాల విషయంలోనూ ఆమె ఓ అడుగు ముందే ఉంటుంది. అప్పట్లో శింబు, ప్రభుదేవాలతో నయనతార ప్రేమ వ్యవహారం ఓ సంచలనం. ఆ విషయం అందరికీ తెలిసిందే.

ఆ ఇద్దరితో బ్రేకప్ అయిన తర్వాత ఒంటరిగానే ఉంటూ తన సినిమా కెరీర్ మీదనే దృష్టి పెట్టిన నయనతార మళ్లీ ప్రేమలో పడ్డట్లు ఆ మధ్య తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా ధనుష్ నిర్మిస్తున్న చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమా సెట్లో ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారని, ఇటీవల ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో గడిపి వచ్చినట్లు, అతనికి నయనతార ఓ ఖరీదైన కారు గిఫ్టుగా కొనిచ్చినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. తర్వాత ఇద్దరూ చర్చిలో పెళ్లి చేసుకున్నట్లు కూడా జాతీయ మీడియాలో వార్తలు రావడంతో ఇద్దరూ స్పందించారు.

తమకు వివాహం కాలేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని అతను స్పష్టం చేసారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలు తమకు ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా నష్టం కలిగిస్తాయని, మీడియా ఆధారం లేని వార్తలు రాయొద్దని విఘ్నేష్ శివన్ రిక్వెస్ట్ చేసారు. ఈ విషయమై ఎలర్టైన నయనతార వెంటనే స్పందించారు. ఈ వార్తలో నిజం లేదని, తన దృష్టి కేవలం సినిమాలపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు.

కాగా...వాళ్లిద్దరూ ఆ విషయాలను ఖండించినప్పటికీ, తమిళ మీడియాలో ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ నడుస్తుందనే వార్తలు ఆగడం లేదు. అందుకు కారణం ఇద్దరూ సన్నిహితంగా మెలగడమే. సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ సన్నిహితంగా దిగిన ఫోటోలు హల్ చల్ చేస్తుండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లక్కేయండి.

నయన్-విఘ్నేష్

నయన్-విఘ్నేష్


నయనతార, విఘ్నేష్ శివన్ సెల్పీ ఫోటో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇద్దరి మధ్య క్లోజ్ సెస్ అనుమానాలకు దారి తీస్తోంది.

సెల్ఫీ మూమెంట్

సెల్ఫీ మూమెంట్


ప్రేమ పక్షులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారికి సంబంధించిన మరో సెల్పీ.

ధనుష్ తో...

ధనుష్ తో...


ధనుష్ తో కలిసి నయనతార, విఘ్నేష్ శివన్.

నయనతార-విఘ్నేష్

నయనతార-విఘ్నేష్


ఈ ఫోటోలో ఇద్దరిని చూస్తే మీకు అనుమానం రావడం లేదా?

 నయనతార

నయనతార

నయనతారనానుమ్ రౌడీదాన్ సినిమాకు సంబంధించి రాధిక, ఇతర నటీనటులతో ఆ ఇద్దరూ..

నయన్-విఘ్నేష్

నయన్-విఘ్నేష్


నానుమ్ రౌడీధాన్ సినిమా యూనిట్ సబ్యులతో కలిసి.

English summary
Not long ago, Nayantara was in news when her marriage rumors took over the tabloids. But she has put them to rest after stating that she is not going to get married anytime soon and affirmed that she is spending all her time only to work. You are wrong if you think it all ended there. According to the latest development in the tale, A selfie moment with her upcoming Tamil movie director, Vignesh Shivan is creating a storm on social networking sites.
Please Wait while comments are loading...