శ్రీవారి సాక్షిగా ప్రభుదేవాపై నయన చిటపటలు
ప్రభుదేవా, నయనతారల ప్రేమ బంధం పెళ్లి వరకు వచ్చి అనుకోని కారణాల వల్ల పెటాకులైన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరూ విడిపోయారు. మొన్నటి వరకు ప్రభుదేవాపై ఎంతో ప్రేమ కురిపించి, ఎన్నో త్యాగాలు చేసిన నయన ఇప్పుడు అతని పేరెత్తినేనే చిటపటలాడుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి బుధవారం తిరుమల వచ్చిన నయనతార...అక్కడ మీడియా ప్రతినిధులు ప్రభుదేవాతో పెళ్లి ప్రస్తావన తేగా చిటపటలాడింది. జీవితంలో తొలిసారిగా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చానని, మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని, ఇలాంటి పవిత్రమైన చోట అలాంటి వాళ్ల ప్రస్తావన తేవడం మీకు సమంజసమా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది.
నయనతార వాస్తవానికి క్రైస్తవ మతస్తురాలు. ప్రభుదేవా కోసం ఆ మధ్య హిందూ మతంలోకి మారింది. ఇప్పుడు ప్రభుదేవా దూరం అయినప్పటికీ హిందూ మత సంప్రదాయాలను కంటిన్యూ చేస్తోంది. శ్రీరామ రాజ్యం సినిమా కూడా ఆమెకు హిందూత్వం కొనసాగించడానికి ఓ కారణం అని అంటున్నారు.
ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన నయనతార మళ్లీ పుంజుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నాగార్జునతో ఓ సినిమాకు కమిట్ అవ్వగా...మరికొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతోనే ఉంటోంది. కోట్ల రూపాయలు మోసం చేసిన ప్రభుదేవాను మళ్లీ అమెతో కలవనీయం అటున్నారు ఆమె బంధువులు.


Click it and Unblock the Notifications