twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతార వేస్ట్...షీలా ‘అదుర్స్’: జూ ఎన్టీఆర్

    By Sindhu
    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న చిత్రం 'అదుర్స్". షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నారు. హీరోయిన్ లుగా నయనతార, షీలా నటిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ సరసన నటించిన శ్రీదేవితో ఈ జూనియర్ నటించాలని వుందంటూ అన్న తన కోరికను శ్రీదేవి పోలికలతో ఉండే షీలాతో నటించి కోరికను యాబై శాతం పూర్తి చేసుకున్నాడట.

    మరి తనతో ఈ సినిమాలో నర్తించిన రెండు పాటల్లో కూడా శ్రీదేవితో డాన్స్ చేస్తున్నట్టుగా ఫీలింగ్ వచ్చిందట. మన ఎన్టీఆర్ కు అందుకే ఈ చిత్రంలో షీలా 'అదుర్స్" అంటున్నాడు. ఈ చిత్రం స్టిల్స్ చూసిన ప్రేక్షకులు కూడా నయనతారను ప్రక్కన బెట్టి షీలాకు మంచి మార్కులు వేస్తున్నారు. పోస్టర్స్ లో కూడా నయనతార కన్నా షీలానే అందంగా వుందంటూ కుర్రకారు షీలాకు ఓట్లు వేస్తున్నారు. ఇది తెలుసుకున్న నయనతార మాత్రం సినిమా విడుదల తర్వాత తనకు మంచి పేరు వస్తుందంటూ ఫోజులిస్తుందని సమాచారం.

    ఇదిలా వుంటే అసలే పరిస్థితులు కొత్త సినిమాల విడుదలకి అనుకూలంగా లేవు. సమైక్యాంధ్ర కే సై అన్న హరికృష్ణ మాటలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీంతో ఎన్టీఆర్ సినిమా వస్తే ఖబడ్దార్ అని తెలంగాణా వాదులు హుకుం జారీ చేశారు. మరి భారీ బడ్జెట్ సినిమా ..భారీగా విడుదల ఇలా సర్వం భారీగా వున్న 'అదుర్స్" డిసెంబర్ 25న రావాల్సి వుంది కానీ ఇలాంటి టైమ్ లో రిలీజ్ చేయడమంటే దుస్సాహసమే. అందుకే 'అదుర్స్" రిలీజ్ ని ఆలస్యం చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X