అనాథలతో అందాలభామ
బాస్ - ఐ లవ్ యూ చిత్రంలో అనాథ పాత్రను అందంగా పోషించి మెప్పించిన హీరోయిన్ నయనతార నిజజీవితంలో అనాథలైన 100 మంది బాలబాలికలతో రెండు గంటలు పాటు గడిపి, వారిని ఉల్లాసపరిచారు. బ్లూ టాప్, జీన్స్ ధరించిన ఈ మళయాల సుందరి అనాథలకు ధైర్యవచనాలు చెబుతూ అలరించారు. బాస్ చిత్రంలో తనకు దర్శకుడు వి.ఎన్. ఆదిత్య చక్కని పాత్ర ఇచ్చారని, తన నటన బాగుంటే గనుక ఆ క్రెడిట్ అంతా దర్శకుడిదేనని, ఎందుకంటే.. ఆయన చెప్పినట్టే తాను నటించానని నయనతార ఈ సందర్భంగా అన్నారు. తనకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి ఆమె కృతజ్ఞతలు చెప్పారు.
ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్స్‌లో బాలబాలికల కోసం ప్రత్యేకంగా బాస్ చిత్రం ప్రదర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పిల్లలు అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. వారందరికీ చిత్ర నిర్మాతల తరపున నయనతార పుస్తకాలు, బహుమతులు పంచిపెట్టారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటులు చంద్రమోహన్, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications