'దుబాయ్ శీను' కాంబినేషన్(రవితేజ, నయనతార) రిపీట్ కాబోతోంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై హాస్య నటుడు గణేష్ బాబు ఓ చిత్రాన్ని నిర్మించబోయే చిత్రం ద్వారా ఈ జంట జతకడుతున్నారు. భధ్ర, తులసి వంటి చిత్రాలతో అలరించిన బోయపాటి శ్రీను ఈ చిత్ర దర్శకుడు. ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి నయనతార చెబుతూ ''డైరక్టర్ శ్రీను చెప్పిన కథ చాలా బాగుంది. నా పాత్రను తీర్చిదిద్దిన విధానం నచ్చింది. రవితేజతో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంద''ని చెప్పారు. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లు నిర్మాత చెప్పారు. ఈ చిత్ర సమర్పణ: రవికిరణ్‌బాబు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రం అనంతరం గణేష్ తన రెండవ చిత్రాన్ని పూరీ దర్శకత్వంలో..పవన్ హీరోగా నిర్మిస్తారు.
Story first published: Monday, February 16, 2009, 13:08 [IST]