»   » అతనితో నిజమే: ఎఫైర్లపై నోరు విప్పిన నయనతార

అతనితో నిజమే: ఎఫైర్లపై నోరు విప్పిన నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్‌ హాట్ హీరోయిన్ నయనతార చుట్టూ ఉన్నన్ని రూమర్స్ మరే హీరోయిన్ చుట్టూ లేవేమో. ఎప్పుడూ ఏదో ఒక రూమర్‌తో నయనతార వార్తల్లో ఉంటూ ఉంటుంది. ఆ రూమర్స్ అన్నీ ఆమె లవ్ ఎఫైర్ల చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే ఇంత కాలం రూమర్లను పెద్దగా పట్టించుకోని నయనతార తాజాగా నోరు విప్పింది.

తన జీవితంలో ప్రేమ వ్యవహారం ఒక్క ప్రభుదేవాతో మాత్రమే ఉందని తెలిపింది. గతంలో అతన్ని ప్రేమించిన మాట నిజమే...కానీ అ తర్వాత పలు కారణాలతో విడిపోయారు. ప్రస్తుతం నేను సింగిల్. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మీడియాలో నాపై వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్లు మాత్రమే అని అన్నారు.

అయితే సినీ జనాలు మాత్రం మరోలా అంటున్నారు. ఎఫైర్లు క్లోజ్ అయ్యాక ఎవరైనా ఇలానే మాట్లాడతారని అంటున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రేమ విఫలం వల్లే..

ప్రేమ విఫలం వల్లే..


జీవితంలో ప్రేమ విఫలం అయిన నయనతార పలు కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

నిజమా?

నిజమా?


జీవితంలో ఇంకా ముఖ్యమైన సుఖాలు అనుభవించకుండానే కఠిన నిర్ణయం తీసుకోవాలిన నిర్ణయించుకుందట. ఆమె నిర్ణయం మరేదో కాదు.... జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోవాలని నిర్ణయించుకుందట.

శింబుతో

శింబుతో


గతంలో శింబుతో పీకల్లోతు ప్రేమాయణంలో నయనతార.... మునిగి తేలినట్లు చాలా ఏళ్ల నుండి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే నయనతార మాత్రం అవేమీ లేదంటోంది.

ప్రభుదేవా

ప్రభుదేవా


ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం ఆమె జీవితంలో ఓ సంచలనం. ఇద్దరూ పెళ్లి చేసుకునే వరకు వెళ్లారు. నయన కోసం తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. ప్రభుదేవా కోసం నయనతార అప్పట్లో మతం మార్చుకుని సినిమాలను సైతం విడిచిపెట్టింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. కొంత కాలం తర్వాత నయనతాక సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Read more about: nayanthara, నయనతార
English summary
Nayantara may have hard-headedly walked out of Prabhu Deva's life, but the actress seems to be still having a special place for him.
Please Wait while comments are loading...