Iraivan OTT: ఓటీటీలోకి రాబోతున్న సైకో థ్రిల్లర్ మూవీ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
తమిళ స్టార్ హీరో జయం రవి, స్టార్ హీరోయిన్ నయనతారలది సూపర్ హిట్ కాంబో. వీరిద్దరు జోడీగా నటించిన తని ఒరువన్ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో తెలిసిందే. ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందనే చెప్పాలి. జయం రవి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా, నయన్ తన అందంతో, అభినయంతో కట్టిపడేసింది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ అంతా బాగుండటంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
'ఇరైవన్' చిత్రాన్ని తెలుగులో 'గాడ్' పేరుతో రిలీజ్ చేశారు. తమిళంలో సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో మాత్రం ఈ నెల 13వ తేదీన రిలీజ్ అయింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో కూడా ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ అందుకుంది. జయం రవి, నయనతార మరోసారి తమ కెమిస్ట్రీతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఐ.అహ్మద్ దర్శకత్వం వహించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సుధన్ సుందరం, జి. జయరాం, సీహెచ్ సతీష్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.

'ఇరైవన్' చిత్రం గురించి మూవీ టీమ్ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 'ఇరైవన్'/'గాడ్' ఈ నెల 26వ తేదీన తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
'ఇరైవన్'/'గాడ్' సినిమాలో జయం రవి అర్జున్ పాత్రను పోషించాడు. నరేన్ రామ్ పాత్రలో ఆండ్రూ నటించాడు. వీరిద్దరూ ఏసీపీలు. అర్జున్, నరేన్ రామ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరిదీ దూకుడు స్వభావం. చాలా ధైర్యంగా కేసులు చేధిస్తూ డిపార్ట్‌మెంట్ లో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. నేరస్థులను పట్టుకోవడం, వారిని విచారించడం, ఆ తర్వాత కోర్టులో హాజరు పరచడం, వారికి శిక్ష పడేలా చేయడం అనేది పెద్ద తతంగమని, టైమ్ వేస్ట్ అనేది వీరిద్దరి అభిప్రాయం. అందుకే నేరస్థులను ఎన్‌కౌంటర్ చేస్తుంటారు. ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుతూ ఉంటారు. అలాంటి వీరిద్దరికి సైకో కిల్లర్ కేసు అప్పగిస్తారు ఉన్నతాధికారులు. అక్కడి నుంచి సినిమా అసలు కథలోకి ఎంటర్ అవుతుంది.

నగరంలో 10 మంది అమ్మాయిలను దారుణంగా హత్యలు చేసే సీరియల్ సైకో కిల్లర్ కేసును వారిద్దరూ ఛేదిస్తారు. అయితే ఈ క్రమంలో ఆండ్రూ ప్రాణాలు కోల్పోతాడు. కానీ సైకో కిల్లర్ అయిన స్మైలింగ్ బ్రహ్మ (రాహుల్ బోస్)ను మాత్రం పట్టుకుంటారు. తన బెస్ట్ ఫ్రెండ్ ను కోల్పోవడంతో అర్జున్ తన పోలీసు విధుల నుంచి తప్పుకుంటాడు. ఆ తర్వాత స్మైలింగ్ బ్రహ్మ పోలీసుల అదుపులో నుంచి తప్పించుకుని అర్జున్ స్నేహితులను ఒక్కొక్కరిగా చంపుతుంటాడు. అసలీ స్మైలింగ్ బ్రహ్మ ఎవరు, అర్జున్ అతడిని ఎలా పట్టుకున్నాడు అనేది మిగతా కథ, ఇందులో నయనతార పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











