నయనతార బాయ్ ఫ్రెండ్ సినిమాలో సమంత.. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందంటే?
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న సమంత నయనతార మొదటిసారి ఒక సినిమాలో కలిసి నటించబోతున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలు నిజమేనని తెలుస్తోంది. గతంలో ఈ స్టార్ హీరోయిన్స్ కి మధ్య కొంచెం గోడవ జరిగిందనే టాక్ కూడా వచ్చింది. ఒక సినిమా చర్చల విషయంలో సమంత నయన్ పై సీరియస్ అయినట్లు కోలీవుడ్ లో కథనాలు వెలువడ్డాయి.
ఆ రూమర్స్ గురించి వీరిద్దరు ఎప్పుడు స్పందించలేదు. ఇకపోతే వీరి కాంబినేషన్ ఒక సినిమా స్టార్ట్ కావడానికి సిద్ధమైంది. అందులో కథానాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు. కాతు వాకులా రేండు కాదల్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమకు నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించబోతున్నాడు.

అసలు మ్యాటట్ లోకి వస్తే.. ఈ సినిమా లాక్ డౌన్ కంటే ముందే మొదలు కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇక మే నెలలో స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికి లాక్ డౌన్ దెబ్బ పడింది. ఇక ఇప్పుడు సినిమాను ఆగస్టులో మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారట. నయనతారతో ప్రేమలో పడిన తరువాత విగ్నేష్ శివన్ ఇంతవరకు సక్సెల్ అందుకోలేదు. ఇక ఇప్పుడైనా సక్సెస్ అందుకుంటాడో లేదో అనేలా కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











