Nayanathara పెళ్లి పత్రిక ఫొటో వైరల్.. పెళ్లికి వచ్చే వారికి కండిషన్.. తప్పనిసరిగా పాటించాల్సిందే!
చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా ఎంతగానో మంచి గుర్తింపును అందుకున్న నయనతార మొత్తానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా నయన్ పెళ్లికి సంబంధించి అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె యువ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంటుందా లేదా అని కోలీవుడ్ మీడియాలో రోజుకో వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే మొత్తానికి ఆమె హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఇక వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రిక ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే పెళ్లికి వచ్చిన వారికి ఒక కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

పెళ్లిపై ఎన్నో పుకార్లు
యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న నయనతార పెళ్లి చేసుకోవడానికి పూర్తి ప్రణాళికతో సిద్ధమైంది. అసలైతే గత ఏడాదిలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు గా అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అలాగే ఆమధ్య దర్శకుడు విగ్నేష్ కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని మీడియా ముందే క్లారిటీ ఇచ్చాడు. ఇక నయనతార మాత్రం ఆ విషయంలో ఎప్పుడు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

పెళ్లి వార్తతో తేల్చేశారు
వీలైనంత వరకు వీరి పెళ్లి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడ్డారు. కానీ సోషల్ మీడియాలో వారి ఫోటోలు ఈజీగా లీక్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక రకాల రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇంతకుముందు అయితే నయనతార విగ్నేష్ కు బ్రేకప్ చెప్పినట్లుగా కూడా టాక్ అయితే వచ్చింది. కానీ అవన్నీ అబద్ధాలు అని పెళ్ళి వార్తతో తేల్చేశారు.

పెళ్లి పత్రిక
ఇక వీరి పెళ్లికి అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి.
ఇక పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటో కూడా వైరల్ గా మారింది. జూన్ 9వ తేదీన మహాబలిపురంలో ఒక ప్రత్యేకమైన షెరటన్ గ్రాండ్ వీరి పెళ్లికి వేదికగా మారింది. వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఉదయం 8:10కి వీరి వివాహం జరగనుంది.

ఒక కండిషన్
అయితే పెళ్లికి వచ్చేవారికి ఒక కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఆవిషయాన్ని వారు వివాహ ఆహ్వాన పత్రిక లో కూడా ప్రత్యేకంగా తెలియజేయడం విశేషం. పెళ్ళికి వచ్చే వారందరూ కూడా ఎత్నిక్ పాస్టల్స్ డ్రెస్ కోడ్ ను పాటించాలి అని అందులో పేర్కొన్నారు. చాలావరకు వీరి పెళ్ళికి కుటుంబ సభ్యులు అలాగే అతి దగ్గరి స్నేహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు గా తెలుస్తోంది. కాబట్టి ఇలాంటి కండిషన్ మంచి సెలబ్రేషన్స్ లో ఒక భాగమే అని డ్రెస్ కోడ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

స్పెషల్ గా లంచ్
ఇక జూన్ 11న ప్రత్యేక లంచ్ కోసం ఈ కొత్త జంట మీడియాను కలవనున్నారు. అలాగే మరి కొంత మంది స్టార్ సెలబ్రిటీలకు కూడా ప్రత్యేకంగా పార్టీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే మొదట, నయన్ విగ్నేష్ తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ ప్లాన్ వర్కౌట్ కాదని కొన్ని ఇబ్బందుల కారణంగా వేదికను మహాబలిపురంకి మార్చారు.


Click it and Unblock the Notifications











