హాట్ న్యూస్: ప్రియుడితో ఎంగేజ్మెంటుకు సిద్ధమవుతున్న నయనతార!

Recommended Video

Nayanthara And Vignesh Shivan To Get Engaged This Year || Filmibeat Telugu

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కొన్ని రోజులుగా తమిళ యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి సహజీవనం మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన వీరి రిలేషన్‌షిప్ రోజులు గడుస్తున్న కొద్దీ మరింత పటిష్టంగా మారుతోంది.

ఓ వైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతూనే... తన ప్రియుడితో విదేశీ ట్రిప్స్ వేస్తూ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతోంది నయనతార. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరు త్వరలో సాంప్రదాయ బద్దంగా ఏకం కాబోతున్నారట. తమ బంధాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.

ఎంగేజ్మెంట్, పెళ్లి దిశగా

ఎంగేజ్మెంట్, పెళ్లి దిశగా

తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... నయనతార-విఘ్నేష్ శివన్ ఈ ఏడాది ఎంగేజ్మెంట్ జరుపుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో ఈ వేడుక జరుగబోతున్నట్లు సమాచారం. 2020 ప్రారంభంలో వివాహం చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారట.

అందుకే లాంగ్ టైమ్ రిలేషన్‌షిప్

అందుకే లాంగ్ టైమ్ రిలేషన్‌షిప్

ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి బంధాలు ఎక్కువ కాలం నిలవడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నయనతార. ఇంతకు ముందు ప్రభుదేవాతో ప్రేమ, పెళ్లి వ్యవహారం చివరి నిమిషంలో బెడిసి కొట్టింది. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదనే ఇద్దరూ లాంగ్ టమ్ రిలేషన కొనసాగించారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు.

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి

మరో వైపు నయనతార, విఘ్నేష్ శివన్‌లకు పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. నాలుగేళ్ల సాహచర్యంలో ఈ జంట పూర్తి సంతృప్తిగా ఉండటంతో పెళ్లికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అభిమానులు శుభవార్త వినబోతున్నారు.

ఇద్దరూ కలిసే ఉంటున్నారు

ఇద్దరూ కలిసే ఉంటున్నారు

నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి జరుగక పోయినా కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ ఆయా ఫెస్టివల్స్ కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుంటున్నారు. ఇక చట్టబద్దంగా భార్య భర్తలు అవ్వడమే తరువాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X