షాకిచ్చే రెమ్యునేషన్స్: అనూష్క,నయనతార

By Srikanya

హైదరాబాద్ : వెండితెరపై నటన, అందాలు ఒలకబోయడం మాత్రమే కాదు రెమ్యునేషన్ విషయంలోనూ హీరోయిన్స్ పోటీ పడి షాకిస్తున్నారు. ఆ హీరోయిన్స్ మరెవరో కాదు...నయనతార, అనూష్క. వీరిని తమ సినిమాలో తీసుకోవాలంటే దాదాపు రెండు కోట్లు వరకూ ఇచ్చుకోవాల్సి వస్తోందని నిర్మాతలు వాపోతున్నారు. అయితే తమిళ,తెలుగు భాషలు రెండింటిలోనూ వారికున్న డిమాండ్ ఓ రేంజ్ లో ఉండటంతో అలాగే కమిటైపోతున్నారు.

'రెండు' చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన అనుష్క ఆశించిన స్థాయిలో తమిళంలో రాణించలేకపోయింది. ఆ తర్వాత విజయ్‌, అజిత్‌, సూర్యలతో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. కోటి రూపాయలు అడిగి ఇక్కడి నిర్మాతలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిన్నటి వరకు ఇదే పారితోషికాన్ని తీసుకుంటున్న అనుష్క తాజాగా మరో కోటి పెంచినట్లు సమాచారం.

తెలుగులో తెరకెక్కుతున్న 'రాణీ రుద్రమ' కోసం అమ్మడు రూ.2 కోట్లు అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలోనూ అదేస్థాయిలో డిమాండ్‌ చేస్తోందట. నయనతార కూడా అదే బాటలో పయనిస్తోంది.

ప్రేమ వ్యవహారం నుంచి బయటపడిన తర్వాత నయనతారకు అవకాశాలు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. అజిత్‌తో 'వలై', ఆర్య సరసన 'రాజా రాణి' చేస్తోంది. వీటికి రూ.కోటికన్నా ఎక్కువగానే అందుకున్నట్లు సమాచారం. విద్యాబాలన్‌ నటించిన 'కహాని' తమిళ, తెలుగు రీమేక్‌లలో నటించేందుకు రూ.2 కోట్లు అడుగుతున్నట్లు సమాచారం. మొదట్లో ససేమిరా అన్న నిర్మాత చివర్లో అంగీకరించినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X