రిక్వస్ట్ చేసిన రాంచరణ్.. రూల్స్ బ్రేక్ చేసిన నయనతార!

Recommended Video

Sye Raa Narasimha Reddy: Nayanatara Accepts To Attend For Sye Raa Movie Promotions| Filmibeat Telugu

కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రల్లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుని వేడెక్కించిన నయనతార ఇప్పడు సౌత్ లో లేడి సూపర్ స్టార్. నయనతార ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తోంది. నయనతార నటించిన చిత్రాలకు స్టార్ హీరోల సినిమా రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. దీనితో నయనతార కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. నయనతార ఈ ఏడాది విశ్వాసం చిత్రంతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో నయన్ కు శుభారంభం జరిగింది. నయన్ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం నయనతార తన సొంత రూల్స్ నే బ్రేక్ చేస్తోందట. ఆ వివరాలు చూద్దాం..

సిద్దమ్మ పాత్రలో

సిద్దమ్మ పాత్రలో

సైరా నరసింహారెడ్డిలో నయనతార సిద్ధమ్మ పాత్రలో నటిస్తోంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శత్వం చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాత. తమిళ నటుడు విజయ్ సేతుపతి, బిగ్ బి అమితాబ్, కిచ్చా సుదీప్, తమన్నా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అప్పటి నుంచి రూల్ పెట్టుకుంది

అప్పటి నుంచి రూల్ పెట్టుకుంది

ఈ సైరా నరసింహారెడ్డి చిత్ర విషయంలో నయనతార గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.గడచిన నాలుగేళ్లలో నయనతార ఆమె నటించిన సినిమాలలో ఒక్క చిత్రానికి కూడా ప్రచారంలో పాల్గొనలేదు. ఇది నయనతార తనకు తాను విధించుకున్న రూల్. అనామిక చిత్ర ప్రచారం కోసం నయనతారకు తానే రాను పోనూ ఫ్లైట్ టికెట్ బుక్ చేసానని నిర్మాత బయటకు చెప్పేశారు. దీనితో హార్ట్ అయిన నయనతార ఇకపై సినిమా ప్రమోషన్స్ కు హాజరు కాకూడదని నిర్ణయించుకుంది.

రిక్వస్ట్ చేసిన రాంచరణ్

రిక్వస్ట్ చేసిన రాంచరణ్

సైరా నరసింహా రెడ్డి భారీ బడ్జెట్, స్టార్ నటీనటులతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం. మెగాస్టార్ చిరంజీవి సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. నిర్మాణ పనులని రాంచరణ్ చూసుకుంటున్నాడు. ఈ ప్రత్యేకమైన సినిమా ప్రమోషన్ లో పాల్గొనాలని రాంచరణ్ నయన్ ని రిక్వస్ట్ చేశాడట. దీనితో నయనతార తన పంతాన్ని పక్కన పెట్టి సైరా ప్రమోషన్స్ కోసం ఒపుకున్నట్లు తెలుస్తోంది.

20కి పైగా చిత్రాలు

20కి పైగా చిత్రాలు

అనామిక చిత్రం తర్వాత నయనతార 20కి పైగా చిత్రాల్లో నటించింది. ఏఒక్క చిత్రానికి కూడా ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ రాంచరణ్ రిక్వస్ట్ చేయగానే అంగీకరించడమే విశేషమే. ఇన్ని రోజులు వెండి తెర మీద మాత్రమే కనిపించిన నయనతార..సైరా చిత్రం కోసం అభిమానుల ముందుకు రాబోతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్, ఆడియో వేడుక, టివి ఇంటర్వ్యూలలో నయన్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. సైరా చిత్రం ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X