డాక్యుమెంటరీలు తీసే దేవికగా నయనతార
రానా,క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుం'. ఇందులో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. ఈ చిత్రంలో నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.
నయనతార ఈ చిత్రం గురించి చెపుతూ...''కథ విన్న వెంటనే మనసు పారేసుకున్నా. క్రిష్‌తో సినిమా కాబట్టి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఈ సినిమాలో నా కాస్ట్యూమ్స్‌ని నిషికా లుల్లా డిజైన్ చేస్తున్నారు'' అంది. దాదాపు 11 నెలల గ్యాప్ తర్వాత నయనతార కెమెరా ముందుకొచ్చి ఈ చిత్రం చేస్తోంది. నాగార్జున, గోపిచంద్, రానా, తమిళంలో అజిత్ నటిస్తున్న 'బిల్లా-2'... ఇలా ఒకేసారి నాలుగు చిత్రాలు ఒప్పుకుని పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక చిత్రం కధ క్రిష్ చెపుతూ...మన పక్కనున్నవాడు, మనం నమ్మినవాడు, మన స్నేహితుడు... వీళ్లంతా శ్రీరాముడంత గొప్పగా ఎందుకు ఉండలేరు? అని ఆలోచిస్తాం.నిందిస్తాం, బాధపడతాం. తీరా మన దగ్గరకొస్తే మాత్రం... శ్రీకృష్ణుడిలా ఉంటేనే మేలనుకొంటాం. ఎందుకంటే నొప్పింపక తానొవ్వక బతికేయొచ్చు. అమ్మాయిలు కూడా కృష్ణుడిలా ఉంటేనే ఇష్టపడతారు. అందుకే బీటెక్ బాబు కూడా ఆయన్నే అనుసరించాడు. శ్రీకృష్ణలీలలు చూపించాడు... అతని సంగతేంటో తెలుసుకోవాలంటే 'కృష్ణం వందే జగద్గురుం' సినిమా చూడాల్సిందే అన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో హీరో,హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. సంగీతం: మణిశర్మ.


Click it and Unblock the Notifications











