వాడే అసలైన మగాడు.. దే‌శంలోని ప్రతీ మహిళ.. నయనతార సెన్సేషన్

దిశా ఎన్‌కౌంటర్‌.. దేశ ఎల్లలు దాటినా ఇదే సెన్సేషన్. ఎక్కడ చూసినా ఈ అంశంపైనే చర్చ. మానవ మృగరాలైన దిశ ఘటన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం హాట్ టాపిక్ అయిపోయింది. ఈ ఉదంతంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార రియాక్ట్ అవుతూ తన స్పందన తెలియజేసింది. వివరాల్లోకి పోతే..

 దారుణ మారణకాండ.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

దారుణ మారణకాండ.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

ఓ 26 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టారు నలుగురు మానవ మృగాలు. ఈ దారుణ మారణకాండ చూసి దేశమంతా చలించిపోయింది. నిందితులను వెంటనే చంపేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. సరిగ్గా ఈ తరుణంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులను హతమార్చారు పోలీసులు.

సినిమాల్లో డైలాగ్‌లా అనిపించినా ఇదే నిజమైంది

సినిమాల్లో డైలాగ్‌లా అనిపించినా ఇదే నిజమైంది

కాగా ఈ ఎన్‌కౌంటర్‌పై ఓ ప్రకటన విడుదల చేసింది లేడీ సూపర్ స్టార్ నయనతార. న్యాయం అనేది వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలి అంటూ తనదైన శైలిలో ఒక లెటర్ విడుదల చేసింది నయన్. ''అన్యాయం జరిగిన వెంటనే న్యాయం జరిగితేనే అది సరైన మార్గం. సినిమాల్లో డైలాగ్‌లా అనిపించినా ఇప్పుడు ఇదే నిజమైంది. నిజమైన హీరోలు తెలంగాణ పోలీసులు ఈ రోజు తమ చర్యతో దాన్ని ప్రూవ్‌ చేశారు. నేను ఇదే మానవత్వాన్ని కాపాడే సరైన చట్టం'' అంటాను అని పేర్కొంది నయనతార.

 దే‌శంలోని ప్రతీ మహిళకు గుర్తుండిపోవాలి

దే‌శంలోని ప్రతీ మహిళకు గుర్తుండిపోవాలి

ఈ డేట్‌ దే‌శంలోని ప్రతీ మహిళకు గుర్తుండిపోవాలి. క్యాలెండర్‌లో మార్క్ చేసి పెట్టుకోవాలని పేర్కొంటూ పోలీసులకు తెలంగాణ గవర్నమెంట్‌కు ధన్యవాదాలు తెలిపింది నయనతార. మానవత్వం అంటే అందరిపై సమానంగా గౌరవించటం, ప్రేమించటం, దయ చూపించటం. ఇప్పుడు జరిగిన ఈ న్యాయానికి సంతోషపడటం కన్నా మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించాలి అని తన లెటర్ లో రాసింది నయన్.

మగ పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయాలి.. వాడే మగాడు

ముఖ్యంగా మన ఇళ్లలోని మగ పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయాలని తెలిపింది నయనతార. బయట సొసైటీలో ఎలా మెలగాలనే విషయంపై బుద్ధులు మగ పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని చెప్పింది ఈ లేడీ సూపర్ స్టార్. ఎవరైతే అమ్మాయిలను గౌరవంగా, క్షేమంగా చూసుకుంటారో వాడే అసలైన మగాడు అనే విషయం తెలియజేయాలని పేర్కొంది.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
నయనతార సినీ జర్నీ

నయనతార సినీ జర్నీ

ప్రస్తుతం దర్బార్‌ సినిమాతో బిజీగా ఉంది నయన్. రజనీకాంత్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది. దీంతో పాటు నెట్రికన్న్‌, ముక్తి అమ్మాన్‌ సినిమాల్లో నటిస్తోంది నటిస్తోంది నయనతార.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X