సినిమా ప్లాపు అయినంత మాత్రాన.... : నయనతార

By Srikanya

హైదరాబాద్ : సినిమా ఫెయిల్యూర్ అయితే పట్టించుకోకూడదని నయనతార చెప్తోంది. ట్యాలెంట్ అనేది ఒక ఫెయి ల్యూర్ తో అంచనా వెయ్యలేమని అంటోంది. ఇంతకీ ఆమె ఏ సినిమాని గుర్తు చేస్తూ అంటోందో అర్దం కాక జనం తల పట్టుకుంటోంది. ఆమె రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ... ''తొలి అడుగులోనే అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోకపోవచ్చు. నిరంతర ప్రయత్నం ఉండాలి. ఏదోక రోజు తప్పకుండా విజయం అందుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క సినిమాలో పనితనం చూసి ఎదుటివారిలో ఉన్న సత్తాని అంచనా వేయకూడదు. ఏమో? ఎవరు చెప్పగలరు.. ఎవరిలో ఎంత ప్రతిభ ఉందో? పరాజయం పొందినంత మాత్రాన తక్కువ అంచనా వేయకూడదు'' అని చెబుతోంది.

అలాగే తనకు ఎడిసన్‌ స్పూర్తి అంటోంది. ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి ముందు ఆ ప్రయోగంలో తొంభై తొమ్మిదిసార్లు విఫలమయ్యాడు. వందో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకొన్నాడు. మధ్యలో ఆగిపోతే... అద్భుతాలు సాధ్యం కావని ఎడిసన్‌ బల్బే చెబుతుంది...నేను అంతే అంటూ...నయనతారకి స్ఫూర్తినిచ్చిన అంశాల్లో ఇదీ ఒకటని చెప్తోంది. రీసెంట్ గా ఆమె రానా సరసన చేసిన కృష్ణం వందే జగద్గురం విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది.

ప్రస్తుతం నయనతార దుబాయ్‌లో తన కుటుంబంతో సరదాగా గడుపుతోంది. ఈ మధ్యనే అక్కడకు క్రిస్మస్‌ పండుగను చేసుకొనేందుకు వెళ్లింది. అలాగే తెలుగులో నాగార్జున సరసన ఓ చిత్రంలో నటిస్తోందామె. దశరధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. సినిమా మొత్తం ఓ రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. షూటింగ్ లో ఎక్కువ భాగం ఫారిన్ లో జరుగుతోంది. మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం తర్వాత దశరధ్ చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X