For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విగ్నేష్‌కి లైఫ్ ఇచ్చిన నయనతార మాజీ ప్రియుడు.. ఆ కనెక్షన్ వల్లే డైరెక్షన్ ఛాన్స్!

  |

  ఎట్టకేలకు నయనతార విగ్నేష్ శివన్ ఏడడుగుల బంధంతో అధికారికంగా ఒక్కటయ్యారు. గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎప్పుడు ఎప్పుడు వివాహం చేసుకుంటారు అని వారి అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు జూన్ 9వ తేదీన వీరు వివాహ బంధంతో ఏకమయ్యారు. అయితే విగ్నేష్ శివన్ దర్శకుడు కావడానికి నయనతార మాజీ ప్రియుడు కారణమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ విశేషాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

  Recommended Video

  Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
  పోలీసు కుటుంబంలో

  పోలీసు కుటుంబంలో

  తమిళనాడుకు చెందిన విఘ్నేష్ శివన్ ఒక పోలీసు అధికారుల కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాగా తల్లి ఇన్స్పెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నారు. ఆయన మైలాపూర్ లో ఉన్న ఒక స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. అదే స్కూల్లో విఘ్నేష్ శివన్ సీనియర్ గా హీరో శింబు ఉండేవాడు. వీరిద్దరి మధ్య అప్పటి నుంచే మంచి స్నేహం ఉండేది.

  షార్ట్ ఫిలిం చేసి

  షార్ట్ ఫిలిం చేసి


  ఈ నేపథ్యంలోనే సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్న సమయంలో అప్పటికే సినిమా హీరోగా ఉన్న శింబు విగ్నేష్ కు సహాయం చేశాడు. తొలుత ఒక షార్ట్ ఫిలిం చేసిన విగ్నేష్ ఆ సినిమాకు మంచి మ్యూజిక్ కూడా ఇప్పించి దాన్ని కొంతమంది ఫిలిం ప్రొడ్యూసర్స్ కి, జెమిని ఫిలిం సర్క్యూట్ వారికి చూపించారు. అలాగే శింబుకి చూపించడంతో విగ్నేష్ శివన్ తో సినిమా చేయడానికి ఆయన సిద్ధమయ్యారు.

  విఐపి సినిమాలో చిన్న పాత్రలో

  విఐపి సినిమాలో చిన్న పాత్రలో


  అలా విగ్నేష్ శివన్ తన కెరీర్ లోనే మొట్ట మొదటి సినిమాగా కూడా పొడా పొడి అనే సినిమా రూపొందించారు. 2012వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కాస్త మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీంతో విగ్నేష్ శివన్ కు వరుస సినిమా అవకాశాలు దక్కలేదు. ఈ క్రమంలో లిరిసిస్ట్ గా, సినిమాలకు రైటర్ గా పని చేస్తూనే ధనుష్ హీరోగా తెరకెక్కిన విఐపి సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా కనిపించాడు విగ్నేష్ శివన్.

  నయనతారతో ప్రేమలో

  నయనతారతో ప్రేమలో


  ఆయన రెండో సినిమా నేను రౌడీనే షూటింగ్ సమయంలో కూడా మొదటి సినిమా లాగానే కష్టపడ్డాడు. ఈ సినిమాలో కూడా తొలుత అనుకున్నదానికంటే అనేక మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమాను విగ్నేష్ తన తల్లిదండ్రుల జీవితాల నుంచి ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకున్నట్లు చెబుతుంటారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన నయనతారతో ప్రేమలో పడ్డాడని అంటుంటారు.

  ఆసక్తికరమైన విషయం

  ఆసక్తికరమైన విషయం

  అయితే మొదట తమిళ హీరో శింబుతో నయన్ ప్రేమాయణం నడిపించింది. వీరిద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేసారు. ఆ తరువాత ఏమయిందో ఏమో తెలియదు కానీ ఆ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసింది నయనతార. వీరిద్దరూ విడిపోవడానికి కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయని అప్పట్లో టాక్ నడిచింది. శింబుతో కటాఫ్ చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాతో కూడా ప్రేమలో పడింది నయనతార.

  ఈ ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళి అనూహ్యంగా యూ టర్న్ తీసుకకోవడంతో వీరిద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి ప్రేమికుడి జూనియర్ కావడం వల్లే డైరెక్షన్ అవకాశం అందుకున్న విగ్నేష్ తో నయనతార ప్రేమలో పడడం కొంత ఆసక్తికరమైన విషయం అనే చెప్పాలి.

  English summary
  Nayanthara ex-boyfriend simbhu gave the first direction chance to Vignesh shivan, because Vignesh was junior to him in school.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X