‘కహానీ’ గుట్టు విప్పిన నయనతార

By Bojja Kumar

హైదరాబాద్ : సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ మూవీ 'కహానీ'కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నయనతార ప్రకటన చేసింది. ఓప్రముఖ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ నయనతార ఈ విషయాన్ని ధృవీకరించింది.

'బాలీవుడ్ మూవీ కహానీ చిత్రానికి రీమేక్ గా తెలుగు, తమిళంలో రూపొందబోయే చిత్రానికి నేను సంతకం చేసారు. ఈచిత్రంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది' అంటూ నయనతార చెప్పిన విషయాన్ని చెన్నయ్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. నయనతార ఈ విషయాన్ని ఇలా అధికారికంగా ప్రకటించడంతో 'కహానీ' చిత్రంపై ఉన్న ఊహాగానాలకు తెరపడ్డట్లయింది.

వాస్తవానికి ఈచిత్రంలో తొలుత అనుష్క పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నయనతార పేరు కూడా వినిపించింది. తర్జన భర్జనల అనంతరం నయనతార పేరు ఫైనల్ అయింది. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించబోతున్నారు. ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు.

ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల పిటిఐతో మాట్లాడుతూ...కహానీ తెలుగు, తమిళం రీమేక్ కు సంబంధించిన స్క్రిప్టు వర్క్ మలి దశలో ఉందని, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని, ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వెల్లడించారు. కాగా....బాలీవుడ్ వెర్షన్ 'కహానీ'కి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించగా, విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X