twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ నమ్మకాన్ని కాపాడుకొంటే చాలు : నయనతార

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ సినిమా చేస్తున్నప్పుడు అవార్డుల గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. దర్శకుడు బాపు, హీరో బాలకృష్ణ నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకొంటే చాలనుకొన్నా. వారిద్దరి నమ్మకమే నాకీ పురస్కారం తెచ్చిపెట్టింది. సీతమ్మ పాత్ర దక్కడం అదృష్టం. అంతకు మించి ఓ గౌరవం. నేను కూడా నా వంతు న్యాయం చేసేందుకే తపించాను అంటూ స్పందించింది నయనతార. 'శ్రీరామరాజ్యం' చిత్రానికి ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నయనతార మీడియాతో మాట్లాడింది.

    నంది పురస్కారానికి ఎంపిక అయినందుకు చాలా సంతోషంగా ఉంది. 'శ్రీరామరాజ్యం' నా జీవితంలో మర్చిపోలేని సినిమా. నంది వచ్చి... ఈ సినిమాని మరింత ప్రత్యేకంగా మిగిల్చింది.ఒకే రకమైన పాత్రలకు పరిమితమైపోతానేమో అనుకొంటున్న తరుణంలో.. 'శ్రీరామరాజ్యం'లో సీత పాత్ర దక్కింది. బాపు సినిమాలో నటించడమే ఓ గౌరవం. ఇప్పుడు... పురస్కారం కూడా దక్కడం ఆనందంగా ఉంది. 'శ్రీరామరాజ్యం'లాంటి సినిమాలో నటించిన తరవాత.. మరో పాత్ర చేయాలంటే ఆలోచించాల్సిందే. ఇక ముందు కూడా ఆచి తూచి సినిమాలను ఎంచుకొంటా అన్నారామె.

    తన తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురుమ్‌.. సినిమా గురించి.. చెపుతూ...కథలో నాది చాలా కీలకమైన పాత్ర. కథానాయిక అంటే.. పాటలకే పరిమితం కాకూడదు. అంతో ఇంతో ప్రాముఖ్యం ఉంటేనే గుర్తింపు. ఈ సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్‌ కూడా చెప్పుకొన్నా. నటిగా పరిపూర్ణమైన సంతృప్తి అందించిన సినిమా ఇది అందామె.

    ప్రస్తుతం తమిళంలో అజిత్ సరసన ఒక చిత్రం చేస్తోంది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్ దర్శకుడు. పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగులో రానా సరసన కృష్ణం వందే జగద్గురుం చిత్రంలోనూ నాగార్జునతో లవ్‌స్టోరీ చిత్రంలోనూ నటిస్తోంది. కృష్ణం వందే జగద్గురుం చిత్రం విడుదలకు ముస్తాబవుతుండగా మాతృభాష మల యాళంలో ఒక చిత్రాన్ని ఒప్పుకుంది. తమిళంలో కార్తీ హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందనున్న బిరియానీ చిత్రంలో నటించడానికి నయనతారను సంప్రదించగా కోటిం పావు పారితోషికం అడిగిందని సమాచారం.

    English summary
    Nayantara won the best actress award for her role of Sita in the film Sri Rama Rajyam.Sri Rama Rajyam is a 2011 mythological Telugu film directed by Bapu. The film depicts Lord Rama's rule of Ayodhya after he returns home from Lanka, his separation from Sita and her reclusive life in the forest as she raises their children Lava and Kusa. The film bagged seven Andhra Pradesh State Nandi Awards, including the Nandi Award for Best Feature Film - (Gold) for the year 2011.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X