»   » వావ్... నయనతార ఎంత అందంగా ఉందో! (కాష్మోరా ఫోటోస్)

వావ్... నయనతార ఎంత అందంగా ఉందో! (కాష్మోరా ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో కార్తీ 'కాష్మోరా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన కార్తి డిఫరెంట్ లుక్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. ట్రైలర్ కూడా అదిరిపోయింది.

ఇందులో నయన్ రత్నమహాదేవి పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన కొన్న పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే గతంలో మనమెప్పుడూ చూడని నయనతారను చూడబోతున్నామని స్పష్టమవుతోంది.

 రత్న మహాదేవి

రత్న మహాదేవి

కాష్మోరా మూవీలో రత్న మహాదేవి సూపర్ హాట్ లుక్ తో కనిపించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆమె ఫోటోస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

 నయన కెరీర్లోనే డిఫరెంట్ మూవీ

నయన కెరీర్లోనే డిఫరెంట్ మూవీ

ఈ చిత్రం నయనతార కెరీర్లోనే ఓ డిఫరెంట్ మూవీ. ఇండస్ట్రీలో సీనియారిటీ, వయసు పెరిగిన కొద్దీ హీరోయిన్లు అవకాశాలు తగ్గడం, అందం తగ్గడం మామూలే. కానీ నయనతార విషయంలో మాత్రం
అవకావాలు, అందం రెండూ పెరిగిపోతున్నాయి.

 హీరో కార్తి

హీరో కార్తి

ఈ చిత్రంలో కార్తీ పాత్ర మూడు విభిన్నమైన షేడ్స్ లో ఉంటుందని....సైనికాధికారిగా, గూఢచారిగా, నేటితరం యువకుడిగా మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో నయనతార, శ్రీ దివ్య హీరోయిన్లుగా చేస్తున్నారు.

పివిపి సంస్థ

పివిపి సంస్థ

పీవీపీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కాష్మోరా ఫస్ట్‌లుక్ విడుదల దగ్గరనుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. కార్తి కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ చిత్రం కాబోతోందని అంటున్నారు.

ట్రైలర్

కాష్మోరా మూవీ ట్రైలర్ ఇదే. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ క

English summary
Check out Nayanthara hot stills from Kashmora Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu