అనామికగా నయనతార
ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైంది. 'కహానీ'లో విద్యాబాలన్ పోషించిన పాత్ర పేరు విద్యా బాగ్చీ. ఆమె సాగించే అన్వేషణ కథను అనేక మలుపులు తిప్పుతుంది. తెలుగు కహానీలో నయన్ పోషించే పాత్ర పేరు అనామిక. ఈ సినిమాను కొంత మేరకు హైదరాబాద్ పాత బస్తీలో చిత్రీకరణ చేస్తారని తెలిసింది.
ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు. సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.
ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...కహానీ తెలుగు, తమిళం రీమేక్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వెల్లడించారు. కాగా....బాలీవుడ్ వెర్షన్ 'కహానీ'కి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించగా, విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించింది.


Click it and Unblock the Notifications












