twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొరటాల సినిమాలో నయనతార.. చిరంజీవితో మళ్ళీ రొమాన్స్, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

    |

    లేడీ సూపర్ స్టార్ నయనతార దూసుకుపోతోంది. మూడుపదుల వయసులో కూడా నయనతారకు వస్తున్న అవకాశాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే. నయనతారకు కూడా క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఎంత భారీ రెమ్యునరేషన్ కి అయినా వెనుకాడడం లేదు. నయనతార ప్రస్తుతం స్టార్ హీరో అజిత్ సరసన విశ్వాసం చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహరెడ్డి. ఈ చిత్రంలో కూడా నయనతారే హీరోయిన్. విజయ్ సరసన మరో చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతోంది. నయనతార క్రేజ్ కు తగ్గట్లుగానే ఆమె సంపాదన ఉందని ఫోర్బ్స్ సంస్థ తేల్చేసింది.

    సౌత్‌లో నెం1

    సౌత్‌లో నెం1

    నయనతార సౌత్ లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ గా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ నటి నయనతార మాత్రమే. దేశ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన సెలెబ్రిటీలలో నయనతార 69వ స్థానం దక్కించుకుంది. రవీంద్ర జడేజా, కమల్ హాసన్, రాంచరణ్ లాంటి స్టార్స్ కన్నా నయనతార ముందుండడం విశేషం.

    ప్రభావవంతమైన మహిళ

    ప్రభావవంతమైన మహిళ


    ఇక 50 మంది ప్రభావంతమైన మహిళల జాబితాలో నయనతార చోటుదక్కించుకుంది. ఈ జాబితాలో మలయాళీ నటి పార్వతి కూడా ఉన్నారు. ఏ గణాంకాలు చాలు నయనతార క్రేజ్ ఎలాంటిదో అని. మూడు పదుల వయసులో కూడా అదిరిపోయే అందంతో నయనతార దూసుకుపోతోంది, కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రంలా కూడా నయనతార మెప్పిస్తోంది.

    మెగాస్టార్ చిరుతో రెండోసారి

    మెగాస్టార్ చిరుతో రెండోసారి

    కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఇప్పటివరకు చాలా మందిపేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ నయనతారని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంటే నయనతార మెగాస్టార్ చిరంజీవితో వరుసగా రెండవ సారి నటించడానికి సిద్ధం అవుతోంది. సైరా నరసింహారెడ్డిలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

    రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

    రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

    ఫోర్బ్స్ లెక్కల ప్రకారం నయనతార సంపాదన 15.17 కోట్లు. ఏడాదికి ఈ భామ ఆ స్థాయిలో ఆదాయం పొందుతోంది. ఇప్పటికే సైరా చిత్రానికి నయన్ భారీగా డిమాండ్ చేసినట్లు వార్తలు ఉన్నాయి. ఇక కొరటాల శివ చిత్రానికి కూడా నయనతార కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ అందుకోబోతోందట. మెగాస్టార్ క్రేజ్ కు తగ్గ హీరోయిన్ నయనతార మాత్రమే కావడంతో నిర్మాతలు నయన్ అడిగినంత సమర్పించుకోటానికి సిద్ధం అవుతున్నారు.

    English summary
    Nayanthara is highest paid actress in south. Nayanthara to romance with Chiranjeevi for second time
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X